కాంతార చాప్ట‌ర్‌ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల మనసులను దోచుకుంటూ బాక్సాఫీస్ వద్ద స్కై రేంజ్‌లో హైప్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకు రిలీజ్ కు ముందే అంచనాలు ఆకాశాన్నంటాయి. అయితే, రిలీజ్ అయ్యాక ఆ అంచనాలకు మించి సూపర్ రెస్పాన్స్ రావడం విశేషం. ప్రేక్షకులు అన్ని భాషల్లోనూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో అద్భుతమైన రివ్యూలు ఇస్తున్నారు. రిషబ్ శెట్టి నటన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా మారింది.


ఇప్పటికే మొదటి భాగం ‘కాంతార’లో తన యాక్టింగ్ తో ఆడియెన్స్ ను కట్టిపడేసిన రిషబ్, ఇప్పుడు ‘కాంతార 1’లో మరింతగా తన పెర్ఫామెన్స్ తో థ్రిల్ చేస్తూ మాయ చేస్తోన్నాడు. ముఖ్యంగా కొన్ని కీల‌క సీన్ల‌లో రిష‌బ్‌ ఎమోషనల్ రేంజ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చూసి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కంటెంట్ పరంగా చూస్తే, సినిమా లోని డివోషనల్ యాంగిల్, కల్చరల్ రూట్స్ ను చూపించే విధానం ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని ఇస్తోంది. సీన్స్ లోని ఇంటెన్సిటీ, బాక్గ్రౌండ్ స్కోర్ తో కలిసిన రిషబ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మందిని ఆకట్టుకుంటోంది. హొంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా అంచనాలకు మించి నిలిచింది.


ఇక కాంతారా చాప్ట‌ర్ 1కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 65 కోట్ల వ‌సూల్లు వ‌చ్చిన‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ప్రీమియ‌ర్ షోల‌తో క‌లుపుకుని.. 65 కోట్ల‌కు పైగా నెట్ క‌లెక్ష‌న్లు రాబట్టింది. ఇక  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కడ వరకూ దూసుకుపోతుందో చూడాలి కానీ, పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ అవడం ఖాయమనే మాట వినిపిస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: