అక్కినేని నాగ చైతన్య వరస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న సమయంలో థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. థాంక్యూ మూవీ లో రాశి కన్నా హీరోయిన్ గా నటించిన ,  విక్రమ్ కే కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన థాంక్యూ మూవీ బాక్సా ఫీస్ దగ్గర అపజయం పాలు అవడంతో పాటు నాగ చైతన్య వరస విజయాలకు కూడా బ్రేక్ వేసింది. అలా థాంక్యూ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన నాగ చైతన్య ఆ తర్వాత అతి తక్కువ రోజుల్లోనే బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చడ్డా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మూవీ లో అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ప్రధాన పాత్రలలో నటించగా నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ నాగ చైతన్య కు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలు ఎదురయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు.

అలాగే నాగ చైతన్య తమిళ క్రేజీ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కకపోయే సినిమాలో నటించడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో కృతి శెట్టి , నాగ చైతన్య సరసన హీరోయిన్ గా నటించిన ఉండగా , ఇళయరాజా , యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 5వవ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: