కొంతమంది హీరోలకు అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది అంటే వారిపై వారు నటించిన సినిమాల యొక్క డిజాస్టర్ తాలూకు ప్రభావం ఏ మాత్రం పడదు. కొంత పాజిటివ్ పేరు కూడా వారికి వస్తూ ఉంటుంది అదే ఇంకొంతమందికి వరుస విజయాలను అందుకున్న కూడా ఒక్క డిజాస్టర్ వస్తే మాత్రం వారిపై ఆ డిజాస్టర్ ప్రభావం ఎంతగానో పడుతూ ఉంటుంది.  వారి అవకాశాలు కూడా తగ్గడానికి ఆ డిజాస్టర్ కారణం అవుతూ ఉంటుంది.

ఆ విధంగా హీరో నితిన్ వరుస పరాజయాలను అందుకుంటున్న కూడా సినిమా మీద సినిమాల అవకాశాలు అందుకోవడం విశేషం. ఆయన హీరోగా రూపొందించిన గత నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో డిజాస్టర్లు అయ్యాయి. ఈ విధంగా నాలుగు సినిమాలు డిజాస్టర్లు అయినా కూడా ఈ హీరోకు కేజీ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. కొంతమంది అగ్ర దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు. పెద్ద పెద్ద బ్యానర్లు సైతం ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నాయి. 

ఇటీవల మాచర్ల నియోజకవర్గం అనే సినిమాతో భారీ స్థాయిలో పరాజయాన్ని అందుకున్న నితిన్ ఇప్పుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలను అందుకున్న ఈ రచయిత వంశీ ఆయన దర్శకత్వం చేయడం మొదలుపెట్టిన తర్వాత చేస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. తొలి చిత్రం అల్లు అర్జున్ తో కలిసి చేసిన నా పేరు సూర్య చేయగా అది ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయినా కూడా కాన్సెప్ట్ పరంగా ఆయన అందరిని అలరించాడు. ఇప్పుడు చేస్తున్న ఈ రెండవ సినిమా ఆయనకు భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: