ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటాయి. సినిమా అంటే తెర నిండా నటీనటులు, ఆరు పాటలు మూడు ఫైట్లు పెట్టుకుంటే హిట్ అవుతుంది అన్న ఫార్ములా వర్క్ అవుట్ కాదని ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. అందుకే కొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి దర్శకులు ముఖ్యంగా యువ దర్శకులు పోటీ పడుతున్నారు.  ఈ వారం కూడా చెప్పుకోవడానికి ఒక ఏడు సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. అయితే వాటిలో చెప్పుకోదగిన సినిమా అంటే "రంగ రంగ వైభవంగ". మెగా హీరో వైష్ణవ్ తేజ్ మరియు కేతిక శర్మలు హీరో హీరోయిన్ లుగా చేశారు. దీనిపై చాలా అంచనాలు ఉన్నప్పటికీ పాత కథలనే అటూ ఇటుగా తిప్పి ఒక కథను రెడీ చేశారు మన డైరెక్టర్ గిరీశయ్య. 

ఇక ఇది కాకుండా చిన్న చిన్న సినిమాలు ఓ బుజ్జి ఇలారా, ఆకాశవీదుల్లో, ఫస్ట్ డే ఫస్ట్ షో, డై హార్డ్ ఫ్యాన్... ఇంకా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం డై హార్డ్ ఫ్యాన్ మినహాయించి ఏ సినిమా కూడా కొత్త కథ కాకపోవడం, పరమ బోరింగ్ గా ఉండడం లాంటి మరి కొన్ని కారణాల వలన ఆకట్టుకోలేదని తెలుస్తోంది.

'డై హార్డ్ ఫ్యాన్' సినిమాను అభిరామ్ అనే కొత్త డైరెక్టర్ తీశాడు. కథ కూడా చాలా కొత్తగా ఉందని పబ్లిక్ టాక్. ఇందులో శివ, ప్రియాంక , షకలక శంకర్, రాజీవ్ కనకాల మరోయు నోయెల్ లు అద్భుతంగా నటించి సినిమా విజయం లో కీలక పాత్ర పోషించారు. కథ చాలా సింపుల్ గా ఉంది.. ఈ సినిమాలో ఒక సినిమా హీరోయిన్ గా ప్రియాంక ఉంటుంది.. ఆమెను ఇష్టపడే ఒక వీరాభిమానిగా మన హీరో శివ ఉంటాడు. కనీసం ఆమెను ఒక్కసారైనా కలవాలని డ్రీం గా ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ హీరోయిన్ తన బర్త్ డే రాత్రి సరాసరి తన ఫ్లాట్ కు వచ్చేస్తుంది. అయితే ఆమె ఎందుకు ఆ ప్లాట్ కు వెళ్ళింది ? ఆ రాత్రి ఏమి జరిగింది ? అన్నవి ప్రశ్నలుగా ఉంటాయి. ఒక చిన్న కథలో సస్పెన్స్ ను సృష్టించి దర్శకుడు అభిరాం ఆకట్టుకున్నాడు. ఇక షకలక శంకర్, రాజీవ్ కనకాల మరియు నోయెల్ లు కథను రక్తి కట్టించారు.

అలా ఈ వారం రిలీజ్ అయిన చాలా సినిమాలలో డై హార్డ్ ఫ్యాన్ మూవీ బాగుందని టాక్. ఒకసారి వెళ్లి చూసేయండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: