టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి బెల్లంకొండ  ఫ్యామిలీ నుంచి రెండో హీరోగా పరిచయమౌతున్నాడు గణేష్ . కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన స్వాతిముత్యం సినిమాతో ఇతడు హీరోగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమా ఇంకా విడుదలకాకముందే, ఈ హీరో ఇంకో సినిమాను కూడా రెడీ చేశాడు.అయితే  ఆ మూవీ పేరు, ఫస్ట్ లుక్ తో పాటు టోటల్ డీటెయిల్స్ బయటకొచ్చాయి.ఇకపోతే 'స్వాతిముత్యం' సినిమాతో అరంగేట్రం చేస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చేస్తున్నాడు. ఇక విమర్శకుల ప్రశంసలు అందుకున్న 'నాంది' సినిమా తర్వాత ఈ బ్యానర్ నుండి వస్తున్న సినిమా ఇది.

అయితే  సతీష్ వర్మ నిర్మాత. ఇక దర్శకుడు తేజ శిష్యుడు రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇదిలావుంటే  మరో దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాకు కథ అందించాడు.అయితే ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మంచి థ్రిల్లర్‌గా రాబోతోంది. ఇదిలావుంటే తాజాగా టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి 'నేను స్టూడెంట్ సర్! ' టైటిల్ ఖరారు చేశారు.అయితే  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో గాయపడిన గణేష్ తన స్టూడెంట్ ఐడెంటిటీ కార్డ్‌ని చూపుతుండగా అతని చుట్టూ తుపాకులు గురిపెట్టడం ఇంట్రస్టింగ్ గా ఉంది.

ఇకపోతే సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఇక  కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.ఇక ఈ హీరో నటించిన స్వాతి ముత్యం సినిమా దసరా కానుకగా విడుదల కాడానికి సిద్ధంగా ఉంది.కాగా ఈ సినిమాలో బెల్లం కొండ గణేష్ సరసన వర్ష బొల్లామ హీరోయిన్ గా నటిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: