లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు ఆయన శంకర్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం తెరకెక్కి అద్భుతమైన భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్న భారతీయుడు మూవీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. భారతీయుడు మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సాధించి , అదే రేంజ్ లో కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది.

మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ విజయంలో ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన భారతీయుడు మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ ని దర్శకుడు శంకర్ , కమల్ హాసన్ హీరోగా ,  కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్  ముఖ్య పాత్రల్లో కొంత కాలం క్రితం మొదలు పెట్టాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి , కొంత భాగం పూర్తి అయిన తర్వాత ఆగిపోయింది.

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఇండియన్ 2 మూవీ షూటింగ్ ని తిరిగి ప్రారంభించారు.  ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇండియన్ 2 మూవీ రన్ టైమ్ దాదాపుగా 3 గంటల 10 నిమిషాల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇండియన్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: