ప్రముఖ నటుడు , నిర్మాత కృష్ణంరాజు ఈరోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం కృష్ణంరాజు వయసు 83 సంవత్సరాలు. కృష్ణంరాజు మృతి పట్ల టాలీవుడ్ తీవ్ర విషాదం నింపుకుంది. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ఇప్పటికే సంతాపం వ్యక్తం చేయడం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం కృష్ణంరాజు అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరుగుతాయి. ఒక కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తన నివాసానికి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఆ తరువాత ఫిలిం ఛాంబర్ వద్ద పార్థివదేహాన్ని ఉంచ బోతున్నట్లు తెలుస్తోంది.

అంత్యక్రియలను సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలియజేసినట్లు తెలుస్తోంది . ఈ విషాద వార్తతో కృష్ణంరాజు అభిమానులు చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు. రాధే శ్యామ్ సినిమా విడుదల సమయంలో కూడా కృష్ణంరాజు తీవ్ర అస్వస్థతతో బాధపడ్డారని పలు వార్తలు వెలుపడ్డాయి. ఇప్పటికే వయసు ఎక్కువ కావడంతో తనకి ఆరోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయని ఏడాది కిందటి ఒకసారి అదుపుతప్పి కింద పడడంతో గాయమైనట్టుగా వార్తలు వినిపించాయి. ఇక దీంతో తన కాలి కణాన్ని కూడా డాక్టర్లు శాస్త్ర చికిత్స చేసి తొలగించారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక తర్వాతే ఎక్కువగా కృష్ణంరాజు వీల్ చైర్ తోనే నడుస్తూ ఉండేవారు.


ఇక కరోనా సమయంలో రెండుసార్లు కరోన బారిన పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ కోవిడ్ సమస్యల వల్ల ఊపిరితిత్తులలో నిమోనియా చేరి లివర్కు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో ఇటీవల గత కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలోనే ఎక్కువగా ఉండవలసి వచ్చినట్లుగా సమాచారం. ఇక కృష్ణంరాజుకు కృత్రిమంగా కూడా ఆక్సిజన్ ని అందించారు.  అయితే చికిత్స చేస్తున్న సమయంలోనే ఈరోజు తెల్లవారుజామున 3:25 గంటలకు మరణించినట్లు వైద్యులు తెలియజేయడం జరిగింది. ఇక రేపటి రోజున కృష్ణంరాజు పార్థివ దేహాన్ని మహాప్రస్థానంలో ఉంచ బోతున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు కృష్ణంరాజు అభిమానులు సైతం పెద్ద ఎత్తున అక్కడికి రాబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: