ఈ మధ్య హీరోలందరూ వాళ్ళ మార్కెట్‌లను బాగా దేశమంతటా విస్తరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు ఒక భాషకే పరిమితమైన సినిమా ఇప్పుడు అన్ని భాషల్లో కూడా విడుదలవుతూ మంచి విజయాలను అయితే నమోదు చేస్తున్నాయి.


సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరు కూడా తమ భాష సినిమాగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌ చిత్రాలు ‘బాహుబలి’ దగ్గర నుండి రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన ‘కార్తికేయ-2’ వరకు జాతీయ స్థాయిలో విడుదలై సంచలన విజయాలను సాధించాయి. ఇక ఇప్పుడు హీరోలు కూడా ఓకే జానర్‌కు అతుక్కుపోకుండా విభిన్న జానర్‌లో సినిమాలను చేస్తూ కంటెంట్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో మరో సీనియర్ స్టార్ హీరో కూడా తన సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ముస్తాబయ్యాడట .


ఆ సీనియర్ స్టార్ హీరో మరెవరో కాదు కింగ్ నాగార్జున. ఆరు పదుల వయసు వచ్చిన యువ హీరోలకు ధీటుగా యాక్షన్ కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ది ఘోస్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుందని సమాచారం.. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో మేకర్స్ ది ఘోస్ట్ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా బ్రహ్మస్త్ర చిత్రంతో నాగార్జునకు హిందీలో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో ‘పుష్ప’ చిత్రాన్ని రిలీజ్ చేసిన ముంబై డిస్ట్రీబ్యూటర్‌ మనీష్‌తో నాగార్జున చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన అయితే రానుంది.


ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడని సమాచారం.. నాగార్జునకు జోడీగా సోనాల్ చౌహన్ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్‌, పుస్కురి రామ్‌మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారట .

మరింత సమాచారం తెలుసుకోండి: