బాలీవుడ్  నుంచి త్వరలో రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'విక్రమ్ వేధ'. హృతిక్‌ రోషన్‌ , సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మాస్‌, యాక్షన్ సీన్లతో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతుంది.

ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. విక్రమ్ వేధ వరల్డ్ వైడ్‌గా 100కు పైగా దేశాల్లో విడుదలవుతుంది. ‘హిందీ చిత్ర పరిశ్రమ చరిత్రలో మొదటిసారి హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన విక్రమ్ వేధ వరల్డ్ వైడ్‌గా 100కు పైగా దేశాల్లో విడుదలవుతుందని’ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పోస్ట్ చేసింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ‘విక్రమ్ వేధ ‘ ట్రైలర్ డైనమిక్‌గా ఉందంటూ ఇప్పటికే స్టార్ హీరో మాధవన్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమిళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచి రికార్డులు సృష్టించిన విక్రమ్ వేధను సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నారు.

ఒరిజినల్ వెర్షన్‌లో మాధవన్‌, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ పోషించారు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన దర్శకద్వయం పుష్కర్‌-గాయత్రి హిందీ వెర్షన్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. విక్రమ్ వేధలో సైఫ్ అలీఖాన్ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా..హృతిక్ రోషన్ గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు.
హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'విక్రమ్‌ వేద' రిలీజ్ కాకాముందే హాట్టాపిక్గా మారింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు మూవీటీమ్ వెల్లడించింది
హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'విక్రమ్‌ వేద'. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి ఓ వార్త ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్రబృదం సిద్ధమైంది. ఏకంగా 100 దేశాల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్‌ లాంటి 22 యూరప్‌ దేశాలతోపాటు ఆఫ్రికాలోని 27 దేశాల్లోనూ విడుదల కానుంది. వీటిలో బాలీవుడ్‌కు అంతగా పట్టులేని జపాన్‌, రష్యా, పెరూ ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం గురించి రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఓవర్సీస్‌ బిజినెస్‌ అధినేత ధ్రువ సిన్హా మాట్లాడుతూ.."విక్రమ్‌ వేద సినిమాను అందరూ ఆదరిస్తారు. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది." అని ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళంలో విజయవంతమైన 'విక్రమ్‌ వేద' చిత్రాన్ని హిందీలోనూ అదే పేరుతో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. పుష్కర్‌ గాయత్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: