తెలుగు నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ రెడ్డి అంటే ఓన్లీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు అందాలు చూపించడంలో కూడా ఈమె తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు. ఇక ఇన్నర్ అందాలను కూడా చూపిస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ ఏదైనా ఒక విషయంలో తల దూర్చింది అంటే ఇక అన్ని పర్సనల్ విషయాలు కూడా బయటకు లాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరిని తన మాటలతో ఒక ఆట ఆడుకున్న శ్రీరెడ్డి ఒకానొక సమయంలో కొంతమంది హీరోలు తనను వాడుకొని వదిలేశారు అంటూ వారి పేర్లను బయట పెట్టడమే కాకుండా వారి పర్సనల్ చాటింగ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా మీడియాకు షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.ఇక ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ చెన్నైలోని తన స్నేహితురాలి తోటలో గుమగుమలాడే వంటలు తయారు చేస్తూ మరొకవైపు వయ్యారాలు వొలకబోస్తూనే ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాలను తన జీవితంతో పోల్చుకుంటూ ముచ్చటిస్తూ ఉంటుంది.


ఇకపోతే యూట్యూబ్ ద్వారా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకున్న శ్రీరెడ్డి యూట్యూబ్ ద్వారా నెలకు బాగా సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీరెడ్డి ఒక్క యూట్యూబ్ ద్వారానే నెలకు 8 లక్షల రూపాయలు సంపాదిస్తోందట. ఇక యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీగా సంపాదిస్తూ పాపులారిటీని కూడా దక్కించుకుంది.ఇక రీసెంట్ గా రాయలసీమ రాగిసంగటి, నాటుకోడి.. పీతలు, రొయ్యలు, ఎండు చేపలు వంటి పల్లెటూరు వంటలు చేసి చూసే చూపరులకు కూడా గుమగుమలాడించింది. ఇక అంతేకాదు వంటింటి చిట్కాలకు సంబంధించిన వీడియోలను కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ మరింత మంది గృహిణులను తన సబ్స్క్రైబర్లుగా మార్చుకుంది. ఈమెకు ఒక్క యూట్యూబ్ ద్వారా ఏకంగా 4 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. పాత విషయాలని పక్కన పెడితే ఏది ఏమైనా శ్రీ రెడ్డి తన లైఫ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: