గతంలో బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాకర్ ఎన్నో సినిమాలలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో నటించే అవకాశం వస్తూనే ఉంటాయి. ఇదిలా ఉండగా ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా సెప్టెంబర్ 16న చంద్రహాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి హీరోగా పరిచయం చేశారు ప్రభాకర్. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు..

కొన్ని సంవత్సరాల తర్వాత మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయడానికి మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. ఇక మా అబ్బాయి యూట్యూబ్లో నాటు నాటు సాంగ్ చేస్తున్నప్పుడు చాలామందికి వాడు మా అబ్బాయి అని తెలియదు. కానీ ఈ విషయాన్ని చాలామందికి తెలియజేయడానికి నేను ఈరోజు మీడియా ముందుకు వచ్చాను అంటూ తెలియజేశారు.. ఇక మా అబ్బాయి హీరోగా ఎంట్రీ ఇవ్వడం కంటే సక్సెస్ అయినప్పుడు మరింత సంతోషంగా ఫీల్ అవుతాను అని ప్రభాకర్ తెలిపాడు. ఇక మొదటి సినిమాకు పగలు,  రాత్రి కష్టపడి పనిచేశాడు. వాడికి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఎప్పటికైనా తప్పకుండా సక్సెస్ సాధిస్తాడు అంటూ తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకొచ్చారు ప్రభాకర్.


ఇక మా అబ్బాయి చిన్నప్పటినుంచి హీరో అవుతానని చెప్పేవాడు. అప్పుడు వాడిని చూసి నేను నవ్వుకునే వాడిని.. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత కూడా అలా ఫీల్ అవుతుంటే ఏంట్రా అనుకున్నాను.  ఐదేళ్ల క్రితమే నాకు వాడి అభిప్రాయం చెప్పగా కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పాను. అనుకున్నట్టుగానే వాడు రెండు సినిమాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా వీడు నటించిన రెండు సినిమాలు కూడా మినిమం గ్యారెంటీ ఉండేలా నేను జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటూ ప్రభాకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: