ఇటీవల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన తొలి సినిమా నుంచి ఆయన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఆ విధంగానే ఇటీవల విక్రమ్ సినిమాతో అందరినీ అలరించిన ఈ హీరో పై ఇప్పుడు అందరి హీరో ల కన్ను పడింది. పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా తనతో సినిమా చేయాలని కబుర్లు పంపుతున్న నేపథ్యంలో లోకేష్ ఎవరితో సినిమా చేస్తాడు అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 వాస్తవానికి తెలుగులో కూడా ఆయన సినిమా చేయాలనే డిమాండ్ పెరిగిపోయిం ది. చాలా మంది అగ్ర హీరోలు ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ లోకేష్ ఇప్పుడు చేస్తున్న సినిమాల తర్వాతనే వేరే చిత్రాలు చేస్తాడని తెలుస్తుంది. దానికి తోడు ఆయన జాబితాలో తెలుగు సినిమా ఉందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం విజయ్ దళపతి తో సినిమా చేస్తున్న ఈ దర్శకుడు ఆ తర్వాత ఖైదీ 2 విక్రమ్ 2 సినిమాలను చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ మూడు సినిమాలు చేసిన తర్వాతనే ఆయన తన తదుపరి సినిమా చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుం టున్నాడు. అయితే అప్పటికి ఎలాంటి పరి స్థితులు వస్తాయో తెలియదు కాబట్టి ఈ దర్శకుడు ఇప్పట్లో తెలుగు సినిమా చేసే ఆలోచనలో లేడనే చెప్పాలి. ఆయన దర్శకత్వం వహిం చిన విక్రమ్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రంపై ఎన్నో అంచనాలను పెట్టుకు న్నారు. అందరూ హీరోలు కూడా ఇలాంటి దర్శకుడుతో మంచి యాక్షన్ సినిమా చేస్తే అది తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి ఈ విధమైన ప్రణాళిక రచిస్తున్నారు. మరి ఏ తెలుగు హీరోతో లోకేష్ సినిమా చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: