టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కింగ్ నాగార్జున చాలా విరామం తరువాత బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర'లో నటించిన విషయం తెలిసిందే. దాదాపు 20 ఏళ్ల విరామం అనంతరం బాలీవుడ్ లో నాగ్ నటించిన హిందీ మూవీ ఇది.బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్ అలియాభట్ ప్రధాన జంటగా నటించగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంంబర్ 9న వరల్డ్ వైడ్ గా విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో నంది ఆస్త్రగా అతిథి పాత్రలో నటించిన నాగ్ తనదైన మార్కు నటనతో ఆకట్టుకున్నారు.ఈ మూవీ తరువాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. 'బ్రహ్మాస్త్ర' మూవీలో నంది అస్త్రగా సర్ ప్రైజ్ చేసిన కింగ్ 'ది ఘోస్ట్'తో మరింతగా ఆడియన్స్ ని సరికొత్త అనుభూతికి లోనే చేయబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. దసరా బరిలో ఆక్టోబర్ 5న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఇప్పటికే హాట్ ఫేవరేట్ గటా మారిపోయింది.చాలా ఏళ్ల తరువాత విక్రమ్ పాత్రలో నాగ్ కనీ వినీ ఎరుగని స్థాయిలో అతరగొట్టబొతున్నపట్టుగా ట్రైలర్ తో స్పష్టమైంది.


మూవీ కోసం ప్రత్యేకంగా కత్తి ఫైట్ తో పాటు ప్రత్యేకమైన మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకన్న నాగ్ ఈ మూవీపై గట్టి నమ్మకంతో వున్నారు. ఎలాగైనా ఈసారి గట్టిగా కొట్టబోతున్నాననే కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ అవుతున్న రోజునే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' రిలీజ్ కాబోంది. దీంతో ఇద్దరి మధ్య క్లాష్ అనేది జరగడం వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో స్పందించిన నాగార్జున ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. చిరుని ఎప్పటి నుంచో చూస్తున్నానని ఆయన ఎన్నో సాధించారని అతన్ని ప్రేక్షకుల ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి బాక్సాఫీస్ పోటీలో తనని బలమైన ప్రత్యర్థిగా భావిస్తున్నానని తెలిపారు. అయితే ఈ విషయంలో కొంత నెర్వస్ గా వున్నానని స్పష్టం చేశారు. ఇక ఎంత పోటీ వున్నా లేకపోయినా కంటెంట్ వున్న సినిమానే నిలబడుతుందన్నారు.దీంతో 'ది ఘోస్ట్' సినిమాపై నాగార్జున ఎంత కాన్ఫిడెంట్ గా వున్నారో స్పష్టమవుతోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: