అలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన "గంగూభాయ్ కతియావాడి" సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. అందులో ఆమె తన నటనకు మంచి గుర్తింపును అందుకుంది. అసలు ఆ పాత్రకు ఆమె సెట్ అవుతుందా అనే అనుమానాలు మొదట చాలానే వచ్చాయి కానీ ఆలియా భట్ అందులో కనిపించిన విధానం ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించింది.అలియా భట్ నడవడిక నుంచి వేషాదరణ వరకు అన్నీ కూడా ఆ సినిమాలో చాలా ఐకానిక్ గా నిలిచాయి. ఇక ముఖ్యంగా ఆమె గంగుబాయి కత్వాడి లుక్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ షోలో కూడా ఒక స్పెషల్ లుక్కు గా మారిపోయింది అప్పుడప్పుడు కొంతమంది స్టార్స్ కూడా అలాంటి లుక్కుతో కనిపించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు రీసెంట్గా మెగా డాటర్ నిహారిక కూడా గంగుబాయి రూపంలో దర్శనం ఇవ్వడం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది.


తెల్లటి కాటన్ చీరలో మ్యాచింగ్ బ్లౌజ్ గాగుల్స్ ధరించి హంసలా నడుస్తూ రెట్రో లుక్స్ తో "గంగూభాయ్ కతియావాడి" సీక్వెన్స్ ను చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా నటీమణులు రూపాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నించారు. గత రాత్రి ఒక కాస్ట్యూమ్ పార్టీకి హాజరైన నిహారిక ఆలియా భట్ లుక్లోకి మారిపోయింది.ఆమె గాగుల్స్ కూడా వేసుకుంది.కాస్ట్యూమ్ పార్టీలు తనకు ఎప్పుడూ ఇష్టమని గంగూని ఆ విధంగా నడిపించానని ఆమె సోషల్ మీడియాలో పేర్కొంది.అయితే నెటిజన్స్ మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.నువ్వేమైన పెద్ద అలియా భట్ అనుకుంటున్నావా? అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక ఇటీవలే హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ను నిర్మించింది. ఆమె మరో రెండు షోలను నిర్మించడానికి కూడా రెడీ అవుతోంది. అలాగే ఆమె మరోసారి వెండితెరపైకి రావాలని కూడా చర్చలు స్టార్ట్ చేసినట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: