ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రాష్ రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైస్ మూవీ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిందో మనందరికీ తెలిసిందే. పుష్ప ది రైస్ మూవీ తెలుగు తో పాటు తమిళ ,  కన్నడ ,  మలయాళ ,  హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అన్ని భాషల నుండి కూడా అదిరి పోయే రెస్పాన్స్ తెచ్చు కొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో ఫాహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించగా ,  సునీల్ ,  అనసూయ , రావు రమేష్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.  

మూవీ కి రాక్ స్టాట్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా , టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంతమూవీ లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ ఐటెం సాంగ్ కి ప్రపంచ వ్యాప్తంగా అదిరి పోయే రేంజ్ క్రేజ్ లభించింది. అలాగే ఈ సాంగ్ ద్వారా సమంత కి కూడా క్రేజ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్ మూవీ లో కూడా ఐటెం సాంగ్ పెట్టే ఉద్దేశంలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ  మలైకా అరోరా ను తీసుకోవాలని మూవీ యూనిట్ అనుకుంటున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: