టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ లో నాగార్జున సరసన రమ్య కృష్ణ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నాగ చైతన్య నటించగా ,  ఈ మూవీ లో యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. కళ్యాణ్ కృష్ణమూవీ కి దర్శకత్వం వహించగా ,  మిక్కీ జే మేయర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. 

ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం విడుదల అయిన హిందీ సినిమా బ్రహ్మాస్త్ర లో నాగార్జున ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగర్జున 'ది ఘోస్ట్' అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా ,  యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ ని ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ది ఘోస్ట్ మూవీ రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: