తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా కెరియర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు గోపీచంద్  ఈ క్రమంలోనే యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అని చెప్పాలి.  అయితే ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోలలో గోపీచంద్ కూడా ఒకరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే గత కొంతకాలం నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు గోపీచంద్. కానీ వరుస ప్లాపులతో సతమతమయ్యాడు అన్న విషయం తెలిసిందే. దీంతో గోపీచంద్ కెరీర్ ముగిసిపోయింది అని అనుకుంటున్న సమయంలో సిటిమార్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.


 ఈ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ అటు కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన పక్క కమర్షియల్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరిని కూడా ఆకట్టుకుని కాస్త కమర్షియల్ గా కూడా ప్లస్ అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు గోపీచంద్ మళ్లీ పూర్తిగా ట్రాక్ లోకి రావాలంటే మాత్రం పక్కా కమర్షియల్ హిట్ కావాలి అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు బ్లాక్బస్టర్ గా నిలిచాయి.


 ముచ్చటగా మూడోసారి వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. మరోవైపు శ్రీనువైట్ల తో సినిమా చేయడానికి గోపీచంద్ సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ఒక థ్రిల్లర్ కథను గోపీచంద్ కు వినిపించాడట దర్శకుడు. అయితే ఇక ఈ సినిమా స్టోరీ నచ్చడంతో గోపీచంద్ కూడా ఓకే చెప్పేసాడట. కానీ శ్రీనువైట్ల పాత టీం తో అయితే సినిమా చేస్తానని ఒక కండిషన్ కూడా పెట్టాడట. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే 2011లో వచ్చిన దూకుడు సినిమా తర్వాత శ్రీనువైట్ల ఒక్క హిట్ సినిమా కూడా తీయలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: