హీరో మనోజ్ రెండో పెళ్లి వార్తలు గత కొన్నిరోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన భూమా నాగిరెడ్డి చిన్న కూతురు మౌనికారెడ్డితో కలిసి కనిపించడమే దీనికి కారణం.
మంచు మనోజ్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన 2015లో ప్రేయసి ప్రణతీ రెడ్డి మెడలో తాళి కట్టాడు. నాలుగేళ్లు ఈ జంట కలిసున్నారు. కారణం తెలియదు కానీ 2019లో విడాకుల ప్రకటన చేశారు. మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రణతీ రెడ్డితో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి తెలియజేశాడు.
విడాకుల ప్రకటన జరిగి దాదాపు మూడేళ్లు కావస్తుంది. మంచు మనోజ్ సింగిల్ గానే ఉన్నారు. ఆ మధ్య అహం బ్రహ్మస్మి టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లిన దాఖలాలు లేవు. ఈ మూవీపై చాలా కాలంగా ఎటువంటి అప్డేట్ లేదు. ఆయన సైలెంట్ అయ్యారు. తాజాగా రెండో పెళ్లి పుకార్లతో మనోజ్ తెరపైకి వచ్చాడు. దానికి కారణం ఆయన జంటగా ఓ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇటీవల మంచు మనోజ్ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనికతో కలిసి వినాయక పూజలో పాల్గొన్నారు. మనోజ్-మౌనిక కలిసి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో మంచు మనోజ్ ఆమెను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తలను మంచు ఫ్యామిలీ ఖండించలేదు. కాగా ఈ వార్తలపై మంచు లక్ష్మీ స్పందించారు. మనోజ్ రెండో పెళ్లి, ప్రేమ వార్తల గురించి ఏమంటారని అడుగగా… ఎవరి బ్రతుకు వాళ్ళను బ్రతకనివ్వండి, అన్నారు.

మంచు లక్ష్మీ ఇంకా మాట్లాడుతూ… మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటే నాకు ఆనందమే. ఈ రోజుల్లో హానెస్ట్ లవ్ దొరకడం చాలా కష్టం. ప్రస్తుతం మనోజ్ అలాంటి స్వచ్ఛమైన ప్రేమను అనుభవిస్తున్నాడు. మనోజ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. నా బ్లెస్సింగ్స్ మనోజ్ కి ఎప్పుడూ ఉంటాయని, లక్ష్మీ అన్నారు. మౌనికను మనోజ్ వివాహం చేసుకుంటాడా లేడా అనే విషయం పక్కన పెడితే… ఆయన ఆమెను ప్రేమిస్తున్న విషయం లక్ష్మీ కన్ఫర్మ్ చేశారు. కాబట్టి త్వరలో మౌనికతో మనోజ్ వివాహం జరగడం ఖాయంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: