ఎన్నో అంచనాల మధ్య  ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది మణరత్నం దర్శత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం. మొదట్లో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కూడా మెలమెల్లగా ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఒకరొకరుగా ఈ సినిమా గురించి, మన చరిత్ర తెలుసుకోవాలని చెప్పి ఈ సినిమా ను చూడడం జరిగింది. తద్వారా ఎప్పటినుంచో మరుగున పడిపోయిన యుద్ధ వీరుల చరిత్రను తెలుసుకొని ఈ సినిమాకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించలేక భారీ స్థాయిలో ఫ్లాప్ అయిపోయాయి. ఓటిటిలో మంచి మంచి సినిమాలు వస్తున్నా నేపథ్యంలో థియేటర్లలో సినిమాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడని ప్రేక్షకులు ఉన్న ఈ రోజులలో ఇలాంటి సినిమాలకు ఆదరణ దక్కదని అపోహ మొదటి నుంచి ఏర్పడింది. దానికి తగ్గట్లుగానే ఈ సినిమా పై పెద్దగా క్రేజీ లేకపోవడంతో ఈ సినిమాకు భారీ నష్టం తప్పదని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ చిత్రబంధం పెట్టుకున్న నమ్మకమే చివరకు నిజమయింది. 

సినిమాలో మంచి కథ ఉంటే తప్పకుండా ఏ సినిమా అయినా భారీ స్థాయిలో వసూలను అందుకుంటుంది అని భావించారు. ఆ విధంగా తోలుత ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు కలవర పెట్టిన కూడా ఫైనల్ గా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రావడం వారికి మరింత కొండంత ఆనందాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ సినిమా యొక్క రెండవ భాగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టమన్నారు. వచ్చే ఏడాది రెండవ భాగాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతుండగా మొదటి భాగానికి ఎంతటి స్థాయిలో రెస్పాన్స్ తీసుకు వచ్చినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో విక్రమ్ హీరోగా నటిస్తూ ఉండగా ఆయనతో పాటు కార్తీ అలాగే జయం రవి ఇతర హీరోలుగా నటించడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: