ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగా స్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఆయన ప్రస్తుతం మన ముందు ఇలా మెగాస్టార్ గా ఉండడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలోకి పేరున్న హీరోగా ఎదిగారు. ఒకానొక టైంలో చిరంజీవి గారు ఏకంగా ఇండస్ట్రీ నే ఏలే హీరో అయ్యారు. ఇక ఈయన చేసే సినిమాల్లో తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలు ఉంటేనే చేస్తారు. ఇక ఈ విధంగా ఎన్నో మంచి మంచి సినిమాలు ఎంచుకొని తన ఖాతాలో బ్లాక్ బస్టర్ సినిమాలు వేసుకున్నాడు. ఇప్పటికే 150 కి పైగా సినిమాల్లో నటించి ఇంకా సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు.చిరంజీవి జీవితాన్ని చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వస్తుంటారు.
అంతే కాదు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వారికి చిరంజీవి ఎన్నో సూచనలు కూడా ఇస్తుంటారట. కానీ అలాంటి చిరంజీవి తన సొంత కొడుకు విషయంలోనే ఓ తప్పు జరిగిందట. అదేంటంటే చిరంజీవి ఎంత చెప్పినా వినకుండా రామ్ చరణ్ ఓ సినిమాలో నటించి ప్రేక్షకుల ముందు బొక్కబోర్లా పడ్డాడట. ఇక విషయంలోకి వెళితే.. మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు రామ్ చరణ్. ఇక ఆ సినిమా సక్సెస్ అవడంతో రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా ని సైతం తన ఖాతాలో వేసుకున్నారు. మగధీర సినిమాతో ఒక్కసారిగా రామ్ చరణ్ కెరీర్ మలుపు తిప్పుకుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులు అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్సినిమా రామ్ చరణ్ ఖాతాలో పడలేదు.

ఇక నిజానికి రాంచరణ్ సినిమా విషయంలో ప్రతిసారి చిరంజీవి సహాయం చేస్తూ ఉంటాడు. కానీ తుఫాను వంటి సినిమా చేసే టైంలో చిరంజీవి ఆ స్టోరీ విని రామ్ చరణ్ కి ఆ స్టోరీ సెట్ అవ్వదని చెప్పారట. ఇక అదే తుఫాను సినిమాని బాలీవుడ్ లో కూడా జంజీర్ అనే పేరుతో తీయడం జరిగింది. ఇక ఈ విషయంలో బాలీవుడ్ ఎంట్రీ అవకాశం వస్తుందనే అత్యుత్సాహంతో రామ్ చరణ్ చిరంజీవి వద్దని ఎంత చెప్పినా కూడా వినకుండా తుఫాను సినిమా చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ జనాలకు పెద్దగా కనెక్ట్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ స్టోరీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే ఒక చెత్తసినిమాగా ముద్ర వేసుకుంది.ఇలా చిరంజీవి ఎంత చెప్పినా వినకుండా రామ్ చరణ్ ఆ సినిమాలో నటించి ఓ చెత్త సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: