టాలీవుడ్ లోకి ఎటువంటి సినీ నేపధ్యం లేకుండా వచ్చి నటుడిగా సెట్ అవ్వాలంటే అన్నింటి కన్నా మించి దైర్యం ఉండాలి. అయితే ఇంతకు ముందు ఎందరో ఇలా వచ్చి నిలదొక్కుకోలేక వెనుతిరిగినవారున్నారు. అదే విధంగా మరి కొందరు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఇండస్ట్రీలో తమ సత్తా చూపించి అగ్రపథాన దూసుకుపోతున్నారు. అందులో ఆనాటి చిరంజీవి నుండి నేటి సత్యదేవ్ వరకు ఎందరో సక్సెస్ అయిన వారున్నారు. అలా పైకి వచ్చిన సత్యదేవ్ మొదట్లో చిన్న చిన్న సహాయ నటుడిగా చేసి తర్వాత హీరోగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అయితే బ్లఫ్ మాస్టర్ తర్వాత సత్యదేవ్ కు సరైన సినిమా పడలేదు. ఇటీవల రిలీజ్ అయిన గాడ్సే కూడా అంచనాలను అందుకోలేక ఫెయిల్ అయింది.

అటువంటి సమయంలోనే చిరంజీవి తో నటించి అవకాశం వచ్చింది. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత వస్తున్నది కావడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా రిజల్ట్ కోసం ఎదురుచూశారు. దీనికి కారణం ఈ సినిమా మలయాళ సినిమా లూసిఫర్ కు రీమేక్ కావడంతో..  ఆల్రెడీ హిట్ అయిన సినిమాను అందరూ చూశారు.. మళ్లీ తెలుగులో తీస్తే హిట్ అవుతుందనే సందేహం అందరిలోను ఉంది. అటువంటి సినిమాలో సత్యదేవ్ ను విలన్ గా తీసుకున్నారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం సత్యదేవ్ ను ఈ సినిమాకు తీసుకోవడంలో చిరంజీవి పాత్ర కీలకం అట. ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వృధా కాకుండా తన నటనతో డైలాగ్ డెలివరీ తో సినిమాను హోరెత్తించాడు.

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చిరంజీవిని కాకుండా , సత్యదేవ్ ను పొగుడుతున్నారు. ఇందుకు కారణం సినిమాలో తన నటనతో చిరంజీవిని పూర్తిగా డామినేట్ చేశాడట. దీనితో సత్యదేవ్ జైదేవ్ అనే పాత్రలో అన్ని భాషల వారిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆ ప్రభావం తన కెరీర్ పై బాగా పెడుతోందట. వస్తున్న సినిమా ఆఫర్ లు అన్నీ కూడా విలన్ గా చేయమని అడుగుతున్నారట. మరి సత్యదేవ్ ఇక హీరోగా చేసే సినిమాలు రావడం కష్టమేనా అంటూ తన అభిమానులు నిరాశ చెందుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: