నటనంటే గ్లామర్ మాత్రమే కాదు. ఆ పదానికి గ్రామర్ తెలిసినా సరిపోతుంది అని నిరూపించిన నటిమణి ఎవరూ అంటే, సాయి పల్లవి అని చెప్పవచ్చు . కురచ దుస్తులు వేసుకొని..

అంగాంగ ప్రదర్శన చేసే నటీమణుల మాదిరి కాకుండా కేవలం అభినయాన్ని మాత్రమే నమ్ముకొని వరుస సినిమాలు చేస్తోంది ఈ నటి . పుట్టింది తమిళనాడులో అయినప్పటికీ.. తమిళం, మలయాళం, తెలుగులో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్  లో ఎక్కువ ఏర్పరచుకున్న నటీమణుల్లో సాయి పల్లవి ముందు వరుసలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఈమె నటించిన గార్గి సినిమా ఏ స్థాయిలో విజయవంతమైందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. సాయి పల్లవి దక్షిణాదిలో కథానాయక ప్రాధాన్యం ఉన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అలాగని కమర్షియల్ సినిమాలను కూడా  ఆమె వదలలేదు. ఫిదా, ఎంసీఏ, పడి పడి లేచే మనసు, శ్యాం సింగరాయ్, విరాటపర్వం, మలయాళ ప్రేమమ్ ఇలా ఏ సినిమా చేసినా ఆమె కంటూ ఒక గుర్తింపు ఉండేలా చేసుకుంది సాయి పల్లవి 0.

సాయి పల్లవి వృత్తిరీత్యా వైద్యురాలు. పూర్తి శాకాహారి. అన్నం, పప్పు ఇవి ఉంటే చాలు అంటుంది ఈ ముద్దు గుమ్మ . సినిమా సెట్ లో ఉన్నప్పుడు కొబ్బరినీళ్లు, మజ్జిగ తప్ప ఇంకా ఏమీ అడగదు అంట మరి . అలాగని పెద్దగా వర్కౌట్లు కూడా చేయదు ఈ అప్పుడప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఆమె శరీరతత్వం బట్టి త్వరగా బరువు పెరగదు మరియు తగ్గగలదు . అందువల్ల ఆమెకు కసరత్తులు చేసే అవసరం  ఎప్పుడూ ఏర్పడలేదు. పైగా సోషల్ మీడియాలో పెద్దగా టచ్ లో ఉండదు. అదంతా టైం వేస్ట్ వ్యవహారం అని కొట్టి పారేస్తుంది.. మరీ ముఖ్యమైన విషయాలు అయితే ఆమె చెల్లి చెబుతుంది. ఫలానా హీరోతో కలిసి నటించాలనే ఆలోచనలు సాయి పల్లవికి  ఏ మాత్రం లేదు . ఆమె దృష్టిలో సినిమా అంటే కథ బాగుండాలి. అలా ఉంటే ఎవరిపక్కనైనా నటిస్తుంది. ఎవరైనా దర్శకులు ఆమెను సంప్రదిస్తే ముందు కథ చెప్పమంటుంది. ఇండస్ట్రీలో ఆమె అందరు హీరోలను గౌరవిస్తుంది. సాయి పల్లవి కి అల్లు అర్జున్ డాన్స్ అంటే తెగ ఇష్టం. మరీ ముఖ్యంగా మహేష్ బాబు స్క్రీన్ ప్రజెన్స్ అంటే చాలా ఇష్టం. మగాళ్లు ఇంత అందంగా ఉంటారని మహేష్ బాబును చూసాకే తనకు అర్థమైందని పలమార్లు చెప్పుకొచ్చింది సాయి పల్లవి . ఒకసారి ఆయనను చూస్తే ఆశ్చర్యపోస్తుంటానని సిగ్గుల మొగ్గ అయ్యింది. బాలీవుడ్లో ఇమ్రాన్ ఖాన్ అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: