సినిమా ఇండస్ట్రీలో లవ్ చేసుకోవడం.. ఆ తరువాత బ్రేకప్ కావడం   బాగ కామన్ ఏ మరి, .. ఇలా బ్రేకప్ చేసుకున్నవాళ్లు ఎవరికి వారు మరొకరిని చూసుకొని సెటిలైపోవడం ఇంకా కామన్..

కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఒకరు.. కాదు.. ఇద్దరు కాదు.. పలువురు హీరోయిన్లతో లవ్ పేరు చెప్పి ముద్దు ముచ్చట్లకు వరకు వెళ్తున్నాడు. కొందరితో ప్రైవేట్ గా కూడా కలిసుంటూ వారికి సంబంధించిన ఫొటోలను కూడా బయటపెట్టాడు. ఆ తరువాత నీకు నాకు చెల్లు.. అని వాడుకొని వదిలేస్తున్నాడు. ఈ హీరో మాయలో పడిన వాళ్లు కూడా ఎందుకీ రభస.. అనుకొని చడీ చప్పుడు లేకుండా ఇతరులను చూసుకున్నారు అంట మరీ . లేటెస్టుగా ఈ లవర్ భాయ్ మరో స్టార్ హీరోయిన్ ను పట్టేశాడు. ఆమెతో లవ్ లో ఉన్నట్లు తెగ వార్తలొస్తున్నాయి. అయితే ఈమెతో ఎన్నిరోజులు సరసాలు చేస్తారో తెలియదు. కానీ ప్రస్తుతం మంచి పొజిషన్లో ఉన్న ఆ నటి కెరీర్ ఏం గానూ..? అని అనుకుంటున్నారు ప్రేక్షకుల .

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు శింబు సినిమాలంటే యూత్ లో  మంచి క్రేజ్. తమిళంలో హిట్టు కొట్టిన 'మన్మథ' అనే మూవీని తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ సినిమా అయినా ఇది అప్పట్లో బారి హిట్టుకొట్టింది. దీంతో శింబు తెలుగులో కూడా స్టార్ హీరో అయ్యాడు సింబు . అప్పటి నుంచి లవర్ భాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. శింబు సినిమాల్లోనే కాదు.. రియల్ గా కూడా లవర్ భాయ్ గా మద్రపడిపోయాడు. మన్మథ సినిమా తరువాత 'వల్లభ' అనే మూవీ వచ్చింది. ఇందులో నయనతార కథానాయక. ఈ సమయంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ  బాగా కుదరడంతో ఇద్దరూ లవ్లో పడిపోయారు.

ఆ తరువాత ఓ హోటల్ లో ప్రైవేట్ గా కలిసున్న ఫొటోలూ కూడా బయటకు వచ్చాయి. నయనతారకు లిప్ లాక్ చేసిన ఫొటో అప్పట్లో భారీ సంచలనం సృష్టించింది. కానీ కొన్ని రోజుల తరువాత వీరు బ్రేకప్ చెప్పుకొని ఎవరికి వారు విడిపోయారు. ఇక ఖాళీగా ఉండడమెందుకని శింబు హన్సికకు వల వేశాడు. మనోడి చేష్టలకు ఆ యంగ్ హీరోయిన్ తొందరగానే ఫిదా అయిపోయింది. శింబుతోనే తన జీవితం అనుకుంది. దీంతో ఆయనతో చెట్టాపట్టాలు వేసుకొని హోటళ్ల వెంట తిరిగింది. వీరి ఫొటోలు కూడా మీడియాకు దొరకడంతో ఈసారైనా వీరు దండలు మార్చుకుంటారని అనుకున్నారు. కానీ అదేం జరగలేదు. ఈమెను కూడా వాడుకొని వదిలేశారు సింబు

మరింత సమాచారం తెలుసుకోండి: