ఏషియన్ సునీల్ తో కలిసి రానా ఈ సినిమా నిర్మించే బాధ్యతలను తీసుకున్నారట. ఇకపోతే ఈ సినిమా తెలుగు నేటివిటీకి అనుగుణంగా పలు మార్పులు చేసి అద్భుతమైన కథను తీర్చిదిద్దే బాధ్యతలను డైరెక్టర్ హరీష్ శంకర్ కు ఇచ్చినట్టు మనకు సమాచారం.
గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ప్రకటించిన విషయం మనకు ఎప్పుడో తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో తేల్చుకోలేని స్థితిలో ఉన్నటువంటి హరీష్ శంకర్ ప్రస్తుతం ఈ సినిమా పనిలో చాలా బిజీగా మారిపోయారు. ఇకపోతే ఈ సినిమాలో నటించడం కోసం శింబు పాత్రలో నటుడు సిద్దు జొన్నలగడ్డను ఎంపిక చేశారట. అదే విధంగా ఎస్ జె సూర్య పాత్రలో మాస్ మహారాజా రవితేజ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావించినట్టు తెలుస్తుంది.
మానాడు సినిమాలో ఎస్ జె సూర్య పాత్ర ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ విలన్ పాత్ర అయితే తెలుగులో విలన్ పాత్రలో నటించడానికి రవితేజ ఒప్పుకుంటారా అనేది ఒక ప్రశ్న,మరియు ఈయన విలన్ గా చేస్తే ప్రేక్షకులు కూడా తనని ఆదరిస్తారా అనే విషయంపై పెద్ద ఎత్తున సందేహాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాలో ఎస్ జె సూర్య పాత్ర ఎంతో విభిన్నంగా ప్రధానమైనది కావడంతో తప్పకుండా రవితేజ ఈ సినిమాకి అంగీకరిస్తారని చిత్ర బృందం కూడా భావిస్తున్నారు. మరి ఈ విషయంలో రవితేజ నిజంగానే ఒప్పుకుంటారా? లేదా? అనే విషయం తెలియాలంటే అధికారక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరీ.