సీనియర్ నటి తులసి బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. శంకరాభరణం సినిమాలో మంజుల కొడుకుగా.. శంకర శాస్త్రి శిష్యుడిగా తులసి నటన ఇప్పటికీ సినీ అభిమానుల మనసులో ముద్రించుకుంది.తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా కాలక్రమంలో చెల్లెలు, అక్క, వదిన, అమ్మ వంటి క్యారెక్టర్లకు షిప్ట్ అయ్యింది. ఏ పాత్ర అయినా సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది.
మూడు నెలల పాప గా ఉన్నప్పుడు భార్య అనే చిత్రంలో ఓ పాపగా తెరంగేట్రం చేసింది తులసి. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మగపిల్లాడి పాత్రలో దాదాపుగా వంద చిత్రాల్లో ఆమె నటించారు. అయితే తాజాగా ఆమె తన వివాహం, తన భర్త వివరాలు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఈమె తన 28వ ఏట కన్నడ డైరెక్టర్ శివమణిని వివాహం చేసుకుంది.
ఒకే రోజులో అతన్ని చూడడం, ప్రేమించడం, సాయంత్రానికి పెళ్లి చేసుకోవడం జరిగిపోయిందట. "'1995 లో 'మదర్ ఇండియా' మూవీలో నటించడానికి చెన్నై వెళ్ళాను. అప్పుడు కన్నడ దర్శకుడు శివమణితో పరిచయం ఏర్పడింది. శివమణిని షూటింగ్ లో చూసినప్పుడు నాకు ప్రేమ ఫీలింగ్ కలిగింది. అయితే పెళ్లి చేసుకుందాం అని అడిగింది మాత్రం నేను కాదు శివమణినే..! అదే నాకు ఆశ్చర్యం కలిగించింది.దాంతో ఆరోజు సాయంత్రమే గుడికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమ..పెళ్లి కేవలం ఒక్కరోజులోనే జరిగిపోవడం ఎప్పటికీ ఓ మెమొరబుల్ మూమెంట్." అని తులసి చెప్పారు.కానీ తన పెళ్లి అయ్యేటప్పటికి తన భర్త చాలా పేదవారని, తన అత్తగారు పాచి పని చేసేదని.. తను కోడలిగా అడుగుపెట్టాకే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగయ్యిందని తులసి చెప్పుకొచ్చింది. ఆయన తీసిన కొన్ని సినిమాలు ఫెయిల్‌ కావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి అంతలా దిగజారింది. అప్పలుపాలయ్యారు అని ఆమె వెల్లడించారు.ఇక వివాహం తర్వాత నేను రాసిన మిణుగు తార అనే కథని మేమే సినిమాగా నిర్మించాం. అది మంచి విజయం సాధించడమే కాక.. ఏకంగా 13 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అయితే సినిమా విడుదలకు ముందు మా ఆయన.. ఈ చిత్రం హిట్టయితే.. బాబా గుడిలోపల ప్రభావళి చేస్తానని మొక్కుకున్నాడు. హిట్‌ అయ్యి.. భారీగా డబ్బు వచ్చాక ఆయన మొక్కు తీర్చుకోలేదు. ఆ ప్రభావమో ఏమో తెలియదు కానీ.. వచ్చిన డబ్బంతా పోయింది. చాలా ఆలస్యంగా మా ఆయన మొక్కు తీర్చుకున్నాడు. ఇక నేను మొదట్లో సాయి బాబాను నమ్మేదాన్ని కాదు. నా తమ్ముడు అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పుడు నేను బాబాను చాలా తిట్టుకున్నాను..ఎంతో బాధపడ్డాను'' అని చెప్పుకొచ్చింది.

ఇలా ఉండగా ఓ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాబా నా గదిలోకి వచ్చి.. అమ్మా అని పిలిచాడు. అంతేకాక గత ఏడు జన్మలుగా నువ్వే నా తల్లివి. ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ నీ కడుపులో పుడతానని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే.. ఆరేళ్లకు నాకు ఓ కొడుకు పుట్టాడు. అంత బాబా దయ అనే భావించి.. నా కొడుక్కికి సాయి అనే పేరు పెట్టుకున్నానను'' అని చెప్పింది. ఇక ఏడాదిన్నర వయసులోనే తులసి బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. భార్య చిత్రంలో రాజబాబు కొడుకుగా నటించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికి.. సీతా మహాలక్ష్మి, శంకారాభరణం సినిమాల్లో పోషించిన పాత్రలతోమంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రస్తుతం తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. డార్లింగ్‌ చిత్రంలో ఇంగ్లీష్‌ రాని తల్లి పాత్రలో అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది తులసి.

మరింత సమాచారం తెలుసుకోండి: