టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుని అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరో గా ఎదిగాడు. తక్కువ టైం లో స్టార్ అయినా కూడా అయన టాలెంట్ ను మెచ్చారు కనుకనే ఇంకా ఆ స్టార్డం ను కొనసాగిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.

సినిమా ఫలితం ఆయనకు అనుకూలంగా రాకపోయినప్పటికీ ఏమాత్రం నిరాశపరచకుండా ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అంతటి భారీ ఫ్లాప్ అందుకున్నప్పటికీ కూడా విజయ్ తన ప్రయత్నాలు ఏ మాత్రం తగ్గించకుండా తదుపరి సినిమాలతో మరింత బలంగా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే అయన మంచి మంచి కథలను లైన్ లో పెట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఫిబ్రవరి లో ఆ సినిమా సౌత్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సినిమా ద్వారా అయన విజయం అందుకోవడం ఖాయం అని చెప్తున్నారు అయన అభిమానులు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ఫైనల్ స్టేజి షూటింగ్ జరుపుకుంటుంది. అయితే గతంలోనే విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు విజయ్ క్లారిటీ ఇచ్చేశారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం అయన ఆ సినిమా చేస్తున్నాడా అన్న సందేహం మొదలవుతుంది. సుకుమార్  ప్రస్తుతం పుష్ప సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ సినిమా ఉంటుందో అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఖుషి తర్వాత విజయ్ చేయబోయే సినిమాపై కసరత్తులు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: