సమంత ఇప్పుడు గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ ఫుల్ బిజిగా వుంది.ఖుషి చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె నటించిన రెండు చిత్రాలు యశోద, శాకుంతలం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‏తో యశోద మూవీపై ఆసక్తిని నెలకొంది. ఇందులో సామ్ ప్రెగ్నెంట్ మహిళగా కనిపించడం.. గాయాలతో సస్పెన్స్ థ్రిల్లర్‏గా టీటర్ రిలీజ్ చేయడంతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.


ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ను నవంబర్ 11న విడుదల చేయనున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. తాజాగా మరో విషయం నెట్టింట వైరల్ అవుతుంది.


యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమ సామ్ కెరీర్‎లోనే అత్యంత సవాలుగా ఉన్న చిత్రాలలో ఒకటి. ఇందులోని పలు యాక్షన్ సన్నివేశాల కోసం సామ్ అసలు వెనకడుగు వేయలేదట. ఈ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్‏మ్యాన్ యాన్నిక్ బెన్‏ వద్ద శిక్షణ తీసుకుందట. గతంలో ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం బెన్ వద్ద యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుందట. ఇక ఇప్పుడు యశోద కోసం అత్యంత కఠినమైన ట్రైనింగ్ తీసుకుందని సమాచారం. ఈ చిత్రానికి హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.ఇక బాలివుడ్ వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించి సిటాడెల్ రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్స్ గా ఈ సిరీస్ రాబోతుంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.ఎ సినిమా సామ్ కు హిట్ టాక్ అందిస్తుందొ చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: