కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత నటించింది  తక్కువ సినిమాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.  ముఖ్యంగా ఈమె స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోకపోయినప్పటికీ ఈమెను అభిమానించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. కన్నడలో పోకిరి రీమేకు సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ప్రణీత తెలుగులో కూడా మంచి మంచి సినిమాలు చేసింది.  యంగ్ హీరోలు అయిన తనిష్ , రామ్ సినిమాలలో నటించిన ప్రణీత సుభాష్.. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించి మెప్పించింది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క ఉన్నట్టుండి లాక్డౌన్ సమయంలో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది ప్రముఖ బిజినెస్ మాన్ నితిన్ రాజ్ తో ప్రణీత పెళ్లి అందర్నీ సర్ప్రైజ్ చేసింది.

ప్రణీత కు అప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకపోయినా నితిన్ రాజ్ పెళ్లి ప్రపోజల్ తెచ్చేసరికి కాదనలేకపోయింది.  ఈ మధ్య జూన్లో ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది ప్రణీత. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన ప్రణీత లాక్డౌన్ సమయంలో తన సోషల్ ఆక్టివిటీస్ తో  ప్రేక్షకులను అలరించింది . తన వంతు సహాయంగా కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసింది ప్రణీత. ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో చేయడానికి సిద్ధమవుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. "ఒక మదర్ గా నా కర్తవ్యాన్ని పూర్తి చేశాను.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ తెలిపింది.

ఇది విన్న తర్వాత పాప పుట్టగానే మీ కర్తవ్యం పూర్తవుతుందా? అంటూ ప్రణీత మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే భర్త ఎంత బిజినెస్ మాన్ అయినా తనకంటూ ఒక జాబ్ రోల్ ఉండాలని.. మళ్ళి తనకు ఇంత క్రేజ్ తెచ్చిన సినిమాల పైనే ఫోకస్ చెయ్యాలని చూస్తోంది ప్రణీత . మరి అనుకున్నట్టుగానే సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది . అయితే ఇప్పుడు మాత్రం తన హాట్ ఫోటోషూట్స్ తో ఫాలోవర్స్ ఆకర్షిస్తుంది ప్రణీత.

మరింత సమాచారం తెలుసుకోండి: