సాధారణంగా సినిమా హీరోలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోల సినిమాల గురించే కాదు వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి కూడా అందరూ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక తెలియకుండానే హీరోల కుటుంబ సభ్యులకు కూడా ఊహించని రీతిలో క్రేజ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక హీరోల భార్యలు ఎక్కడ కనిపించినా కూడా వారితో ఫోటో దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా తెరమీదికి వచ్చి క్రేజ్ సంపాదించిన హీరోల భార్యలు ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం..

 విషిత : ఒకప్పుడు టాలీవుడ్ ను వరుస హిట్లతో షేక్ చేసిన హీరో ఉదయ్ కిరణ్ అంటే చాలు ఎంతో మంది మహిళా అభిమానులే కాదు హీరోయిన్లు కూడా పడి చచ్చిపోయేవారు. ఇక ఎంతోమంది అతనితో ప్రేమలో పడ్డారు. కానీ ఉదయ్ కిరణ్ సింపుల్గా విషిత అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అన్నవరంలో పెళ్లి చేసుకున్నాడు. చివరికి కెరియర్ సాఫీగా లేకపోవడంతో మనస్థాపంతో  ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. అతని భార్యగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న రిషిత ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అని చెప్పాలి.

 శ్రావణి : ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా తన హవా నడిపించాడు సంగీత దర్శకుడు చక్రి. అయితే ఆయన అనారోగ్యం కారణంగా హార్ట్ ఎటాక్ రావడంతో మరణించాడు. అయితే చక్రి మరణానికి ముందు ఆయన భార్యా శ్రావణి కూడా ఎక్కువగా మీడియా ముందు కనిపిస్తూ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ చక్రి మరణం తర్వాత ఆమె మీడియాకు అస్సలు దొరకడం లేదు.

 ప్రణతి రెడ్డి : మంచు వారి హీరో మనోజ్ ప్రణీతి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ పెళ్లైన రెండేళ్లకే వీరి మధ్య మనస్పారుదలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు మనోజ్ వేరే పెళ్లికి సిద్ధమవుతున్నాడని వార్తలు రాగా ఇక ప్రణతి రెడ్డి మాత్రం ఏమైంది ఎక్కడ ఉంది అన్నది ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: