బిగ్ బాస్ 6 అప్పుడే ఏడో వారం ఎలిమినేషన్ కు చేరుకుంది..గత సీజన్ల తో పోలిస్తే ఈ సీజన్ లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించడం కాస్త కష్టమే..మొదటి రోజు నుంచి షో చప్పగా సాగుతుందనడంలో సందేహం లేదు. ప్రతి వారం హోస్ట్ నాగార్జున వచ్చి ఎంటర్టైన్ చేయండి అంటూ చివాట్లు పెడుతున్నా.. కంటెస్టెంట్స్ ఆట తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో ఏకంగా బిగ్‎బాస్ రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చే స్థాయికి తమ ఆట తీరును తీసుకువచ్చారు. ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్లిపోండి అంటూ గేట్లు కూడా తెరిచేశారు. దీంతో క్షమించండి అంటూ వేడుకున్నారు ఇంటి సభ్యులు. ఇక ఆ తర్వాత బిగ్‎బాస్ ఇచ్చిన టాస్కులను కంప్లీట్ చేసేందుకు తెగ అవస్థలు పడ్డారు హౌస్మేట్స్. ఇక ఇప్పుడు బిగ్‎బాస్ ఏడో వారం ఎలిమినేషన్ సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు షానీ, అభినయ, చంటి, ఆరోహి, నేహ ఇంటి నుంచి బయటకు రాగా.. ఇక ఇప్పుడు మరో ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.


అయితే మొదటి నుంచి బిగ్‎బాస్ ఎలిమినేట్ ఎవరు అనే విషయం నెట్టింట లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎలిమినేషన్ ముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు కూడా ఏడోవారం ఇంటి నుంచి బయటకు వచ్చే ఇంటిసభ్యుడి పేరు లీకైంది. ఈవారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం. ఈ వారం ఆదిరెడ్డి, ఆదిత్య, అర్జున్ కళ్యాణ్, ఫైమా, ఇనయ, కీర్తి, మెరీనా, రాజ్, రేవంత్, రోహిత్, శ్రీహాన్, శ్రీసత్య, వాసంతి నామినేట్ కాగా.. ముందునుంచి మెరీనా ఎలిమినేట్ కాబోతుందనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ చివరి నిమిషంలో అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది.


ఇక హౌస్ లో అర్జున్ ఆట తీరు,అతని ప్రవర్తన జనాలకు పెద్దగా నచ్చలేదు..శ్రీసత్య వెనక తిరగడం.. ఆమె కోసమే గేమ్ ఆడడం చేస్తూ ప్రేక్షకులకు విసుగు పుట్టించాడు. అయితే శ్రీసత్య మాత్రం అర్జున్‏ను హద్దుల్లో పెడుతూ.. దూరంగా ఉంటూ వస్తోంది. కానీ అర్జున్ అయితే తను బిగ్‎బాస్ హౌస్ లో ఉన్నాడని.. టాస్క్ ఆడాలి.. గెలవాలి అనే విషయాలు పూర్తిగా మర్చిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులేకాదు.. బిగ్‎బాస్ సైతం అర్జున్ కు బాయ్ చెప్పినట్లుగా టాక్. ఇదే కాకుండా ఈ వారం రేవంత్ తో జరిగిన గొడవ కూడా అతనికి మైనస్ అయినట్లుగా సమాచారం. ఇందులో అప్పటివరకు కేవలం గేమ్ పై ఫోకస్ పెట్టిన అర్జున్.. రేవంత్ అన్న మాటను పట్టించుకోలేదు. ఆ తర్వాత శ్రీసత్య రెచ్చగొట్టడంతో రేవంత్ తో గొడవకు దిగాడు..అదే అతనికి మైనస్ అయ్యిందని తెలుస్తుంది.ఆట తీరు సున్నా..అందరితో తీరు జీరో దాంతో ఈరోజు హౌస్ నుంచి బయటకు వచ్చేది అర్జున్ అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: