నితిన్ మ్యాస్ట్రో తర్వాత దర్శకుడు మేర్లపాక గాంధీ చేస్తోన్న లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. మ్యాస్ట్రో నిరాశ పరచడంతో ఇప్పుడు ఎలాగైన హిట్ కొట్టాలని కసిమీద ఉన్నాడు గాంధీ.
ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ ఈ లో హీరోగా నటిస్తున్నారు. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ విడుదలకు సిద్ధంగా వుంది. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ ని నిర్వహించిన చిత్ర యూనిట్ నవంబర్ 4న ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈసందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ నవంబర్ 4న విడుదల కాబోతుంది. ప్రభాస్ గారి చేతులు మీదగా 25న ట్రైలర్ విడుదల చేస్తున్నాం. ప్రభాస్ అన్న ఫ్యాన్ గా ఇది నాకు చాలా ఎక్సయిటింగా వుంది. మేర్లపాక గాంధీ గారు ఇచ్చిన కథతో ఎక్ మినీ కథ చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం అనందంగా వుంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లి గారికి కృతజ్ఞతలు. ఫరియా అబ్దుల్లా తో నటించడం హ్యాపీగా వుంది. బ్రహ్మజీ గారి పాత్రలోనే కాదు ఆయనతో షూటింగ్ లో కూడా చాలా ఫన్ ని ఎంజాయ్ చేశాం” అని చెప్పుకొచ్చారు.

బ్రహ్మజీ మాట్లాడుతూ.. శ్యామ్ సింగారాయ్ తీసిన వెంకట్ బోయనపల్లి గారు ఈ తీసున్నారంటే ఈ కథ ఎంత బావుంటుందో అర్ధం చేసుకోవచ్చు. చాలా క్యాలిటీ వున్న తీశారు. ఇందులో మనసుకు నచ్చిన పాత్ర చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ప్రతి పదేళ్ళకు మంచి బ్రేక్ ఇచ్చే పాత్ర వస్తుంటుంది. అలాంటి బ్రేక్ వచ్చే పాత్రని ఇందులో చేశాను. మేర్లపాక గాంధీ అద్భుతంగా తీశారు. నవంబర్ 4న విదుదలౌతుంది. ఖచ్చితంగా హిట్ ఇది. మీ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి’ అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: