మనము నిశితంగా పరిశీలిస్తే గత కొంత కాలంగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అంతా మరణిస్తున్నారు. కారణాలు ఏమైనప్పటికీ చాలా మంది సినీ రంగానికి చెందిన వారే చనిపోతూ ఉండడం ప్రేక్షకులను మరియు సినిమా ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర విచారానికి గురి చేస్తోంది. చనిపోతున్న వారిలో నటీ నటులు, నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు ఉన్నారు. ఇలా ఏదో ఒక విధంగా చిత్ర పరిశ్రమ విషాదంలోనే ఉంటోంది. ఇప్పుడు తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక దర్శకుడు దీపావళి సంబరాలను జరుపుకుంటున్న ఈ శుభ సమయంలో మరణించడం జరిగింది. మరి ఆ దర్శకుడు ఎవరు అసలు ఏమి జరిగింది అన్న పూర్తి వివరాల్లోకి వెళితే,  

వెస్ట్ బెంగాల్ కు చెందిన  ప్రముఖ డైరెక్టర్ పినాకీ చౌదరి చనిపోయారు. వీరి బంధువుల నుండి వినిపిస్తున్న ప్రకారం గత కొంతకాలంగా ఈయన కాన్సర్ తో బాధపడుతున్నారట. ఈ కాన్సర్ కు సంబంధించిన ట్రీట్ మెంట్ ను కూడా తీసుకుంటున్నారట. అయితే కాన్సర్ మరీ ముదరడంతో ప్రాణం మీదకు వచ్చిందని తెలుస్తోంది. వాస్తవంగా ఈయన తన సొంత ఇంటిలో సోమవారం రోజున మరణించారు. కానీ ఈ వార్త ఆలస్యంగా అందరికీ తెలిసింది. పినాకీ చౌదరి డైరెక్టర్ గా మారి సంవత్సరాలు అయింది .

పినాకీ చౌదరి "చెనా అచ్చెనా" అనే సినిమాతో మెగా ఫోన్ పట్టాడు, ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలలో షాంఘాత్, బాలీగంజ్ కోర్ట్ చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ చిత్రాలకు అప్పట్లో జాతీయ అవార్డులు దక్కడం విశేషం. ఇలా జాతీయ అవార్డు గ్రహీత అయిన పికఈ చౌదరి మరణించడం చాలా బాధాకరం. ఈయన మరణానికి పలువురు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: