నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇటీవల వచ్చిన సినిమా బింసారా.. ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బింబిసారుడు అనే రాజు కథను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సోషియో ఫాంటసీ మూవీ ప్రేక్షకులకు విపరీతం గా ఆకట్టుకుంది. వశిష్ట్‌ దర్శకత్వం వహించిన ఈ లో టైమ్ ట్రావెలింగ్‌ సబ్జెక్ట్‌ను చాలా ఆసక్తికరంగా చూపించాడు. తక్కువ బడ్జెట్‌లో నే భారీ విజువల్స్‌ తో ను తెరకెక్కించిన విధానం ప్రేక్షకుల తో పాటు ఇండస్ట్రీని సైతం మెస్మరైజ్‌ చేసింది. బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ ప్రస్తుతం ఓటీటీ లోనూ దూసుకుపోతోంది. కళ్యాణ్ రామ్ సినీ చరిత్రలో ఈ సినిమా మరపు రాణి జ్ఞాపకం.. భారీ హిట్ ను అందించింది. మంచి సక్సెస్ ను కూడా అనుదుకుంది..


ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలైన నాటి నుంచి.. బింబిసారా సీక్వెల్‌కు సంబంధించి వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే తాజాగా దర్శకుడు సినిమా సీక్వెల్‌పై ఎట్టకేలకు అధికారికంగా స్పందించాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాల ....ను పంచుకున్నారు. బింబిసార సీక్వెల్‌ ఉంటుందనే విషయాన్ని ప్రకటించాడు.


ఈ సందర్భంగా దర్శకుడు వశిష్ట.. ‘బింబిసార ను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులు ప్రస్తుతం సీక్వెల్‌ కోసం ఎంతో ఆతృత గా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాల కు తగ్గట్లుగానే బింబిసార సీక్వెల్‌ను తెరకెక్కించనున్నాము’ అని చెప్పు కొచ్చారు. అయితే కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత బింబిసార-2 షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే కళ్యాణ్‌ రామ్‌ ప్రస్తుతం నవీన్‌ మేడారం దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నారు.. ఆ సినిమా కూడా హీరోకు ప్లస్ అవుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: