హీరోయిన్ అదితి రావు హైదరి  తో సిద్ధార్థ్  ప్రేమలో ఉన్నారా? అంటే...ఇప్పుడు ఎక్కడ విన్న 'అవును' అని తమిళ చిత్ర పరిశ్రమలో కొందరు అంటున్నారు.ఆయన గానీ, ఆమె గానీ ఎప్పుడూ తాము ప్రేమలో ఉన్నామని చెప్పలేదు.ఇక  కట్ చేస్తే... అదితి రావు హైదరి పుట్టినరోజు సందర్భంగా సిద్ధార్థ్ చేసిన పోస్ట్ నెటిజనుల దృష్టిని ఆకర్షించింది.ఇకపోతే ''హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్'' అని అదితి రావు హైదరిని ట్యాగ్ చేస్తూ ఆమెతో దిగిన ఫోటోను సిద్ధార్థ్ పోస్ట్ చేశారు.ఇక  'ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్' అంటే? అనేది నెటిజన్స్ డౌట్. కాగా తన హృదయంలో రాణి స్థానం అదితిదే అని సిద్ధార్థ్ కన్ఫర్మ్ చేశారా?

ఈ పోస్ట్ వెనుక మీనింగ్ ఏంటి? అనేది డిస్కషన్ పాయింట్ అవుతోంది.ఇదిలావుంటే ఇక సిద్ధార్థ్ పోస్ట్ కింద కొన్ని కామెంట్స్ చూస్తే... వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సినీ ప్రముఖులు స్పష్టం చేస్తున్నట్లు ఉంది. ఇక అదితి రావు హైదరికి కొన్ని సినిమాల్లో ఏకా లఖాని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అయితే మణిరత్నం తాజా సినిమా 'పొన్నియిన్ సెల్వన్'కు కూడా ఆమె పని చేశారు. ఇకపోతే ఈ ఫోటో కింద ఆవిడ హగ్గులు ఇస్తున్న ఎమోజీ పోస్ట్ చేశారు.కాగా  'మేజర్' నిర్మాతలలో ఒకరైన శరత్ 'లవ్ యు గైస్' అని పేర్కొన్నారు. చాలా మంది అదితికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.అయితే  కొందరు సిద్ధార్థ్ మళ్ళీ ప్రేమలో పడ్డారని కామెంట్ చేయడం గమనార్హం.

అయితే 'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'లో సిద్ధార్థ్, అదితి రావు హైదరి జంటగా నటించారు.ఇక  అందులో శర్వానంద్ హీరో అయినప్పటికీ... సిద్ధార్థ్‌తో అదితి ప్రేమలో పడినట్టు చూపించారు. కాగా ఆ సినిమా చేసే సమయంలో నిజ జీవితంలోనూ ఇద్దరు ప్రేమలో పడినట్టు గుసగుస. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ చేసిన పోస్టుతో అది నిజమని తేలిందని నెటిజనులు భావిస్తున్నారు.ఇదిలావుంటే అదితి రావు హైదరి కలలు అన్నీ నిజం కావాలని కోరుకుంటున్నట్టు సిద్ధార్థ్ పేర్కొన్నారు. ఇక ఇంకో విషయం ఏంటంటే... 'మహా సముద్రం' చిత్రీకరణలో దిగిన ఫోటోలు కాకుండా అదితి రావు హైదరితో ఉన్న ఫోటోను సిద్దార్థ్ పోస్ట్ చేయడం కూడా ఇదే తొలిసారి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: