కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న యాష్ ,  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ లతో దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ విడుదల అయ్యి చాలా కాలం అవుతున్న యాష్ హీరోగా నటించబోయే తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఆ మధ్య కొంత కాలం క్రితం యాష్ పలానా దర్శకుడు తో సినిమా చేయబోతున్నాడు అని కొన్ని వార్తలు బయటికి వచ్చినప్పటికీ , ఇప్పటి వరకు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా యాష్ తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ ఇండస్ట్రీ నుండి భారీ అంచనాలతో బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా విడుదల కాబోతోంది.

అందులో మొదటి భాగం కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. బ్రహ్మాస్త్రం మొదటి భాగంలో రన్బీర్ కపూర్ హీరోగా నటించిన ఆలియా భట్ హీరోయిన్ గా నటించింది. అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మూవీ లో యాష్ ను నటింపమని కోరుతూ ఆఫర్ వచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బ్రహ్మాస్త్ర మొదటి భాగం మంచి విజయం సాధించడంతో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 , బ్రహ్మాస్త్ర పార్ట్ 3 మూవీ లపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: