టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. యాక్టింగ్ లోనూ, డాన్స్ లలోనూ, తనకు తానే పోటీ అని తారక్ చాలా సార్లు నిరూపించుకున్నాడు. ఇక ఎన్టీఆర్ లోని సంపూర్ణ నటుడ్ని వాడుకునేందుకు డైరెక్టర్స్ విపరీతమైన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అందుకే తారక్ తో సినిమా చేయడం ప్రతి డైరెక్టర్ కూడా ఒక డ్రీమ్ గా పెట్టుకుంటారు. అదే విధంగా తారక్ తో చేసేందుకు ఓ యంగ్ డైరెక్టర్ గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఉప్పెన మూవీ దర్శకుడు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన బుచ్చిబాబు తన తొలి సినిమా ” ఉప్పెన ” తో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఉప్పెన తరువాత ఈ డైరెక్టర్ క్రేజ్ అమాంతంగా పెరగడంతో వరుస ఆఫర్లు వచ్చాయి..అయితే ఆ ఆఫర్స్ అన్నీ కాదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఓ స్టోరీ సిద్దం చేసుకున్న బుచ్చిబాబు.. స్టోరీ కూడా తారక్ కు వినిపించాడట. స్టోరీ నచ్చడంతో బుచ్చిబాబు డైరెక్షన్ లో మూవీ చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఉంటుందా ? ఒకవేళ ఉంటే ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది ? అనే దానిపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఎందుకంటే ప్రస్తుతం తారక్ కొరటాల శివతో ఓ మూవీ చేసేందుకు సిద్దమయ్యాడు.

ఈ ప్రాజెక్ట్ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు తారక్.. ఆ తరువాత త్రివిక్రమ్ మళ్ళీ లైన్లో ఉన్నాడు. దాంతో బుచ్చిబాబు ను తారక్ పూర్తి పక్కన పెట్టేశాడనే వార్తలు వస్తున్నాయి. అయితే బుచ్చి బాబు మాత్రం తారక్ తో తప్ప వేరే హీరోతో మూవీ చేసేందుకు ఏ మాత్రం సిద్దంగాలేరట. ఒకవేళ తారక్ కోసం ఎదురు చూడాల్సి వస్తే.. ఇంకో మూడేళ్లు బుచ్చిబాబు కు ఎదురు చూపులు తప్పవు. మరి బుచ్చిబాబు అంతవరకు ఎదురు చూస్తాడా ? లేదా ఎన్టీఆర్ ను కాదని వేరే చిన్న హీరోతో మూవీకి ప్లాన్ చేస్తాడా ? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: