కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకూ రాహుల్ గాంధీ జోడోయాత్ర చేపడుతున్న సంగతి మనకి తెలిసిందే. ప్రస్తుతం ఆయన యాత్ర తెలంగాణలో జోరుగా బాగానే సాగుతోంది.

అయితే ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోంది. దారిపొడవునా అన్నివర్గాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామాలకు జోడో యాత్ర వేదికవుతోంది అని చెప్పొచ్చు. ఇటీవల సినీ నటి, సామాజికవేత్త పూనమ్ కౌర్ రాహుల్ యాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలను బీజేపీకి ప్రచారాస్త్రంగా మారాయి. కాషాయ పార్టీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. సోషల్ మీడియాలో చిత్రాలను వైరల్ చేస్తోంది. అయితే దీనిపై పూనమ్ కూడా దీటుగా స్పందించారు. అ విమర్శలను వారి విచక్షణకే విడిచిపెడుతున్నట్టు ప్రకటించారు.


అయితే రాహుల్ గతనికి భిన్నంగా కనిపిస్తున్నారు ఈ యాత్ర లో,. జనంతో మమేకమవుతున్నారు. గతంలో తాను కోల్పోయిన అభిమానాన్ని జోడో యాత్ర ద్వారా ప్రజల నుంచి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు రాహుల్ గాంధీ. అటు జనం కూడా రాహుల్ తో కలిసి నడిచేందుకు ఇష్టపడుతున్నారు. దారిపొడవునా స్థానికుల కష్టాలను తెచ్చుకునే క్రమంలో హామీలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వాటన్నింటి తీర్చుతానని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న యాత్రలో రాహుల్ ను కలిసిన పూనం కౌర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మరీ. చేనేత వస్త్రాలను ధరించిన ఆమె రాహుల్ చేయి పట్టుకొని పాదయాత్రలో నడవడం  బాగా హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ ప్రత్యర్థులకు విమర్శనాస్త్రంగా మారింది.

రాహుల్ గాంధీ చేయి పట్టుకొని పూనమ్ కలిసి నడవడంపై బీజేపీ నేతలు టార్గెట్ గా చేశారు. అంత అవసరం ఏమొచ్చిందని సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ఆమె చేయి పట్టుకొని రాహుల్ లాగడం ఏమిటని అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది పూనమ్ కు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆమె చేయి పట్టుకొని పక్కకు లాగిన రాహుల్ నడవమంటూ పురమాయించడంపై కూడా సటైర్లు వేస్తున్నారు. బీజేపీ నేతలు అయితే రాహుల్ మహిళతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ తప్పుపట్టడం ప్రారంభించారు.


అయితే ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా ముదురుతుండడంతో నటి పూనమ్ కౌర్ స్పందించారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేతకు రాహుల్ హామీ ఇచ్చినందునే తాను జోడో యాత్రకు సంఘీభావం తెలిపిన విషయాన్ని  ఇలా గుర్తుచేశారు. రాహుల్ చేయి పట్టుకొని నడవడం, తన చేయిపట్టి రాహుల్ లాగడం వంటి వాటిపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని పూనమ్ కౌర్ తిప్పికొట్టారు. మహిళ పట్ల రాహుల్ వ్యవహరించే మర్యాద, గౌరవం తన హార్ట్ ను టచ్ చేశాయని కూడా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు వారి విచక్షణకే విడిచిపెడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా పూనమ్ రియాక్టు కావడంతో బీజేపీ నేతలు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు అని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: