గడిచిన కొద్ది రోజుల నుండి ఎక్కువగా లైగర్ వివాదం ముదురుతోంది అని చెప్పవచ్చు. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. డిస్ట్రిబ్యూటర్ మరియు దర్శక నిర్మాతలు మధ్య పలు వివాదాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సినిమా చుట్టూ నెలకొన్న భారీ హైప్ ఈ సినిమా కొన్న బయ్యర్లకు భారీ నష్టాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పరిహార విషయంలో నైతిక బాధ్యతలు తీసుకున్న పూరీ జగన్నాథ్ కొనుగోలుదారుల మధ్య పలు వివాదాలు  చుట్టూ ముడుతూనే ఉన్నాయి.



ఎగ్జిబిటర్స్ కలిసి పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో వీరి వెనుక డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్షియల్ శోభన్ బాబు ఉన్నారంటూ పూరి జగన్నాథ్ పోలీస్ కేసులో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ గొడవ మరింత ముదిరిపోయింది. అప్పటినుంచి ఈ వ్యవహారంపై పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు లైగర్ సినిమా విషయంలో ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయం పైన ఏవిధంగా స్పందించలేదు. తన పేరు మీద గానే మార్కెట్ అవుతున్న సినిమా ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో హీరో పఫేమ్ ఏం ఉండదని హిట్ అయిన ఫ్లాప్ అయిన లాభనష్టాలతో అతనికి ఏమి సంబంధం ఉండదు.


కాకపోతే తన సినిమా కారణంగా నష్టపోయారు కదా అని కొంతమంది హీరోలు మాత్రం ఎంతో కొంత ఇస్తూ ఉంటారు. అందులో ఇక్కడ లైగర్ సినిమాపై హై క్రియేట్ అవ్వడానికి ప్రధాన కారణం విజయ్ దేవరకొండ కానీ తన సినిమా వసూళ్లు రూ. 200 కోట్ల నుంచి ప్రారంభమవుతాయని ఇండియా మొత్తం షేర్ చేస్తుందని చాలా సార్లు తెలియజేస్తూ ఉండేవారు దీంతో ఈ సినిమాకి మంచి హైట్ నెలకొన్నడంతో ఈ సినిమాను బయర్లు సైతం కొనడం జరిగిందట. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కొంతమంది నెటిజన్లు విజయ్ దేవరకొండ ఈ విషయం పైన స్పందిస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: