తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హను రాఘవపూడి తాజాగా సీతా రామం అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా ,  మృణల్ ఠాగూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రష్మిక మందన ఈ మూవీ.లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , తరుణ్ భాస్కర్ ,  గౌతమ్ వాసుదేవ్ మీనన్ ,  సుమంత్ ,  భూమిక చావ్లా ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 5 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయ్యి , బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది.

మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయం లో విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఈ మూవీ ద్వారా దర్శకుడు హను రాఘవపూడి కి ,  హీరో దుల్కర్ సల్మాన్ కి ,  హీరోయిన్ మృణల్ ఠాకూర్ కు అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" స్ట్రీమింగ్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. సీతా రామం మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ దక్కించుకుంది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ఈ మూవీ ని సెప్టెంబర్ 18 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ హిందీ వర్షన్ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: