

ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలలో వైట్ కలర్ బికినీ ధరించి సముద్ర తీరాన ఇసుకపై మోకరిల్లి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇలా ఫోటోలకు ఫోజులిచ్చిన తీరును చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ఇకపోతే ఈ ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తికర క్యాప్షన్ కూడా రాసింది.." నా పుట్టిన రోజున నేను చాలా ప్రేమను పొందాను.. ఈసారి పుట్టినరోజున నా కుటుంబం.. నేనిప్పుడు నా స్నేహితులని పిలుస్తున్న కొంతమంది అద్భుతమైన వ్యక్తులతో గడిపాను.. నేను మరికొన్ని ఫోటోలను త్వరలోనే షేర్ చేస్తాను.. కానీ ప్రస్తుతానికి ఈ విధంగా అనుభూతి చెందుతూ దీనిని అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నన్ను ఎంతో అందంగా మనోహరంగా చూపించే ఫోటోలు తీసినందుకు విహాన్ సమత్ కు ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ సుధీర్ఘ నోటు రాసుకొచ్చింది.
