బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటీమణు లలో ఒకరు అయినటు వంటి ఫాతిమా సన షేక్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫాతిమా సనా షేక్ 1997 లో ఇష్క్ మూవీ లో బాల నటి గా సినీ రంగం లోకి అడుగు పెట్టి చచ్చి 420 , తహాన్ ,  వన్ 2 కా 4 వంటి సినిమాల్లో బాల నటిగా నటించి అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫ్ క్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దంగల్ మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది. 2016 వ సంవత్సరంలో విడుదల అయిన దంగల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అలాగే దంగల్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లు వచ్చాయి.

ఇలా దంగల్ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం తో ఈ మూవీ ద్వారా ఫాతిమా సనా షేక్ కు అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇలా దంగల్ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ దంగల్ మూవీ తర్వాత అనేక మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఫాతిమా సనా షేక్ తనకు ఉన్న వ్యాధి గురించి చెప్పుకొచ్చింది. తాజాగా ఫాతిమా సనా షేక్ తనకు మూర్ఛ వ్యాధి ఉంది అని చెప్పింది. దంగల్ మూవీ కోసం శిక్షణ పొందుతున్న సమయం లోనే ఈ వ్యాధి నిర్ధారణ అయింది అని ఫాతిమా సనా షేక్ తాజాగా వెల్లడించింది. తన కుటుంబం మరియు స్నేహితుల నుంచి మంచి మద్దతు అందడం వల్లే తాను బలంగా ఉండగలుగుతున్నాను అని ఫాతిమా సనా షేక్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: