నటుడు కృష్ణ గుండెపోటు, మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల చనిపోయినట్లు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారుఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మృతి నేపథ్యం లో సోషల్ మీడియా లో ఆయన అభిమానులతో పాటు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.ఇక ఈ సమయంలోనే కొందరు సూపర్ స్టార్ కృష్ణ మృతికి.. అంతకు ముందు ఆయన సతీమణి ఇందిరా దేవి మృతికి.. అంతకు ముందు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతికి కారణం వారి ఇంట్లో పవిత్ర లోకేష్

 అడుగు పెట్టడమే అంటూ కొందరు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.అయితే ఆమెకు కృష్ణ ఫ్యామిలీ కి సంబంధమేంటి అనుకుంటున్నారా.. వాళ్ళు చెప్తున్న లాజిక్ ప్రకారం గత సంవత్సరం చివర్లో కృష్ణ ఫ్యామిలీకి చెందిన నరేష్ తో పవిత్ర లోకేష్ యొక్క సహజీవనం మొదలైంది.ఐఠె అప్పటి నుండి కృష్ణ ఫ్యామిలీ లో వరుసగా ఏదో ఒక చెడు జరుగుతూ వస్తుందని.. ఆమె వల్లే ఇదంతా జరుగుతుందని కొందరు విడ్డూరమైన లాజిక్ తీస్తున్నారు. కానీ ఇక నరేష్ కి సూపర్ స్టార్ కృష్ణ కి రక్త సంబంధం అయితే లేదు.ఇకపోతే నరేష్ తల్లి విజయనిర్మల సూపర్ స్టార్ కృష్ణ భార్య అనే విషయం తెలిసిందే.

ఇక అంతకు మించి ఎక్కువ రిలేషన్ అయితే లేదు, అయినా కూడా పవిత్ర లోకేష్ ఆ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఇవన్నీ జరుగుతున్నాయి అనడం చాలా విడ్డూరమని ఇలాంటి పిచ్చి పుకార్లు పుట్టించి కొందరి పై తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరి కాదంటూ సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినీపరిశ్రమలో ఎన్నో అధునాతన విషయాలు తెరమీదకు తెచ్చిన నటుడు..కోట్లాది మంది ప్రేక్షకులను విషాదంలో ముంచుతూ శాశ్వత సెలవు తీసుకున్నాడు.ఇక గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు.!!

మరింత సమాచారం తెలుసుకోండి: