నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అఖండ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్ల గొట్టడంతో పోయిన సంవత్సరం బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో అఖండ మూవీ చేరిపోయింది. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా , ప్రగ్యా జైస్వాల్మూవీ లో హీరోయిన్ గా నటించింది. పూర్ణమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , శ్రీకాంత్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఇలా అఖండ లాంటి మాస్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాలకృష్ణ , గోపీచంద్ మల్లినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే పవర్ ప్యాకెడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో ఈ మూవీ లో నటిస్తూ ఉండగా , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీర సింహా రెడ్డి మూవీ ని 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సోషల్ మీడియా వేదికగా జై బాలయ్య, త్వరలో తొడ గొట్టి దుమ్ము లేపే టైం వచ్చిందిరో  అంటూ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ తమన్ వీర సింహా రెడ్డి మూవీ ఫస్ట్ సాంగ్ విడుదల కోసమే చేశాడు అని బాలకృష్ణ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే ఇది వరకే తమన్ "అఖండ" మూవీ కి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ని అందించడంతో వీర సింహా రెడ్డి మూవీ ఆల్బమ్ పై కూడా బాలకృష్ణ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: