తాజాగా సంగీత "మసుద" అనే  హారర్ జోనర్ మూవీలో కీలక పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సాయికిరణ్ దర్శకత్వం వహించగా , స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈ మూవీ ని రాహుల్ యాదవ్ నక్క నిర్మించాడు. సంగీత తో పాటు ఈ మూవీ లో తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ, కార్తీక్ అడుసుమిల్లి తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి మూవీ కి సంగీతం అందించగా , నాగేష్ బానెల్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయగా , జెస్విన్ ప్రభు ఈ మూవీ కి ఎడిటర్ గా పనిచేశాడు. ఈ మూవీ నవంబర్ 18 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ మూవీ పై సినీ ప్రేమికులు పెట్టుకున్నారు. అలా మసుద మూవీ విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకుల మంచి అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా పరవాలేదు అనే రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మసుద మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 1.03 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 1.05 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బడిలోకి దిగింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు నుండే మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడంతో ఈ మూవీ 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 1.80 కోట్ల షేర్ , 3.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ 3 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని 30 లక్షల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: