స్వీటీ అనుష్క నిశ్శబ్ధం తర్వాత కెరీర్ కూడా సైలెంట్ అయ్యేలా చేసుకుంది. తనకు ఛాన్సులు రావట్లేదా లేక వస్తున్నా అమ్మడు చేయట్లేదా అన్నది తెలియదు కానీ అనుష్క సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా నవీన్ శెట్టి మూవీలో నటిస్తున్న అమ్మడు ఆ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది. మరి నవీన్ శెట్టి మూవీ తర్వాత అనుష్క మరో సినిమా చేస్తుందా లేక మళ్లీ కెరీర్ గూఅప్ తీసుకుంటుందా అన్నది చూడాలి. తనకు నచ్చిన కథలు రాకనే సినిమాలు చేయట్లేదని చెబుతున్నా అసలు మ్యాటర్ వేరే ఉందని తెలుస్తుంది.

ఇంట్లో వాళ్లు పెళ్లికి ఫోర్స్ చేస్తుండటంతో అనుష్క ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. అయితే తనకు నచ్చిన వాడు దొరక్కపోవడంతో అమ్మడికి సినిమాల వైపు గాలి మళ్లింది. నవీన్ సినిమా తర్వాత కెరీర్ గ్యాప్ తీసుకోవాలని అనుకోని అనుష్క ఇప్పటివరకు నెక్స్ట్ సినిమా కన్ ఫర్మ్ చేయలేదు. కచ్చితంగా అనుష్క సినిమాలను కొనసాగించాలని అనుకుంటుంది కానీ ఆమెకు సరైన కథ దొరకట్లేదని టాక్. ఆమె దగ్గరకు వస్తున్న కథలన్ని రొటీన్ గా అనిపించడం వల్ల వాటిని చేసి ఉన్న ఇమేజ్ పోగొట్టుకోవడం ఇష్టం లేక అమ్మడు ఖాళీగా ఉంటుంది.

అనుష్క తీసుకుంటున్న ఈ గ్యాప్ మంచి కథ కోసమా లేక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకునేందుకా అని ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. నిశ్శబ్ధం హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్ల అనుష్క రిస్క్ లో పడ్డది. మళ్లీ కం బ్యాక్ మూవీ కోసం ఎదురుచూడగా నవీన్ పొలిశెట్టి మూవీ ఛాన్స్ అందుకుంది. యువ హీరొ నవీన్ సినిమాలో స్టార్ హీరోయిన్ తను నటించడం ఏంటని ఆలోచించకుండా అమ్మడు ఆ సినిమా చేస్తుంది. సినిమాలో అనుష్కే హైలెట్ అవుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: