యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జీ ఎఫ్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆండ్రూస్ పాత్రలో నటించిన అవినాష్ కూడా ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. కే జి ఎఫ్ మూవీ లోని అవినాష్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. దానితో ఈ నటుడు కి ఇతర భాష సినిమాల నుండి కూడా అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయి.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ క్రేజీ నటుడి కి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తేరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో అవకాశం లభించింది.  తాజాగా అవినాష్ యువ నటుడు బాబీ సింహా తో కలిసి దిగిన ఒక ఫోటో ని షేర్ చేసి  తనతో కలిసి చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య మూవీ లో నటించడం చాలా ఆనందంగా ఉందని తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ తెలిపారు. దీనితో అవినాష్ , మెగాస్టార్ చిరంజీవి హీరో గా బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య మూవీ లో ఒక పాత్రలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయిపోయింది.

ఇది ఇలా ఉంటే అవినాష్మూవీ తో పాటు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి మూవీ లో కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ ల ద్వారా అవినాష్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ రేంజ్ గుర్తింపును దక్కించుకుంటాడో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య , నందమూరి నరసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీర సింహా రెడ్డి రెండు సినిమాలు కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: