వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం భేడియా.పాన్ ఇండియా సినిమాగా ఈరోజు విడుదల అయ్యింది. తెలుగులో తోడేలుగా ఈ సినిమా విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సినిమాకి కూడా కొత్తదనం అనేది అవసరం. అది కొంతవరకు బాగానే ఉంటుంది కానీ మరీ ఎక్కువైతే మాత్రం కచ్చితంగా సమస్యలు వస్తాయి. తోడేలు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఎందుకంటే ఈ సినిమా కథ బాగుంది.. కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. కానీ తీసిన విధానం మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లేతో  చేసిన దర్శకుడు.. ఆ తర్వాత అదే స్పీడ్ కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మొదటి 20 నిమిషాలు అంతగా ఉండదు. హీరో పరిచయం ఇంకా అతడికి కాంట్రాక్ట్ రావడం.. దానికోసం స్నేహితులతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ రావడం.. ఓ పాట అలా వెళ్ళిపోతుంది సినిమా అంతే.


వరుణ్ ధావన్‌ను తోడేలు కరిచిన తర్వాతే అసలు కథ అనేది మొదలవుతుంది. అక్కడ్నుంచి ఇతనిలో వచ్చే మార్పులు.. మధ్యలో మనుషులపై వరుణ్ చేసే దాడులు చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది.. మనిషి తోడేలుగా మారే సన్నివేశాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదే ఈ సినిమా సెకండాఫ్‌పై మరింత ఉత్కంఠ పెంచుతుంది. కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో మాత్రం దర్శకుడు అమర్ కౌశిక్ ఫెయిల్ అయ్యాడు. ట్విస్టులు అనేవి ఊహించినట్లుగానే ఉన్నాయి.. పైగా స్క్రీన్ ప్లే కూడా చాలా మామూలుగానే ఉంటుంది.అయితే ఫస్ట్  హాఫ్  లాగా సెకండ్  హాఫ్  కూడా బాగా తీసుంటే ఖచ్చితంగా ఈ సినిమా ఒక రేంజిలో ఉండేది.మొత్తానికి ఈ సినిమా జస్ట్  యావరేజ్  అని చెప్పాలి. ఇక వసూళ్ళని బట్టి ఈ సినిమా హిట్  అవుతుందో ప్లాప్  అవుతుందో చూడాలి. ఒక రెండు మూడు రోజులు ఆగితే  ఈ సినిమా పూర్తి ఫలితం ఎలా ఉంటుందో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: