మంచు బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఇక నటుడు మోహన్ బాబు ఫెయిల్యూర్ వారసులు. అయితే స్టార్ కాకపోయినా కనీసం ఓ మోస్తరు హీరోలుగా నిలబడలేకపోయారు.కాగా  నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్, చిత్ర పరిశ్రమ పెద్దల్లో ఒకరిగా ఉన్న మోహన్ బాబు కుమారులు విష్ణు, మనోజ్ ఈ స్థాయిలో వైఫల్యం చెందడం దురదృష్టకరం.ఇక మంచు విష్ణుని అయితే మోహన్ బాబు భారీగా లాంచ్ చేశాడు. 20 ఏళ్ల క్రితం దాదాపు రూ. 28 కోట్ల బడ్జెట్ తో విష్ణు డెబ్యూ మూవీ 'విష్ణు' నిర్మించారు. అయితే అది ఇప్పటి వంద కోట్లకు సమానం.

కాగా విష్ణు డిజాస్టర్ అయ్యింది. మంచు విష్ణు ఇచ్చిన షాక్ తో మనోజ్ ని కొంచెం సింపుల్ గా ఎంటర్ చేశారు.అయితే తమిళ రీమేక్ దొంగ దొంగది మూవీతో మనోజ్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. కాగా విష్ణు, మనోజ్ లలో ఒక్కరికి కూడా బ్రేక్ రాలేదు. ఏదో అడపాదడపా హిట్స్ పడినా ఫేమ్, నేమ్ తేలేదు. ఇదిలావుంటే మరోవైపు ఎవరి అండదండలు లేకుండా కొందరు హీరోలు వారిద్దరినీ దాటి ఎక్కడికో వెళ్లిపోయారు. ఫెయిల్యూర్ కెరీర్ తో పాటు పర్సనల్ ప్రాబ్లమ్స్ మనోజ్ ని ఇబ్బంది పెట్టాయి.  అంతేకాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితో విడాకులు అయ్యాయి.ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా మంచు విష్ణు సినిమాలు చేస్తున్నాడు.

ఇకపోతే మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా కాలం అవుతుంది. ఇక అహం బ్రహ్మాస్మి టైటిల్ తో ఒక పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. లాక్ డౌన్ కి ముందు అనౌన్స్మెంట్ రాగా… రెండేళ్లు దాటిపోయినా అప్డేట్ లేదు.అయితే  ఈ క్రమంలో అన్నయ్య మంచు విష్ణుతో మనోజ్ కి విబేధాలు వచ్చాయంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది.ఇదిలావుంటే నవంబర్ 23న మంచు విష్ణు బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా మనోజ్ కొంచెం భిన్నంగా బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ఇక జిన్నా ప్రీ రిలీజ్ వేడుకలో 'జారు మిఠాయా' సాంగ్ పాడిన సింగర్ ని కలిసి ఆమెతో ఆ పాట పాడించి… హ్యాపీ బర్త్ డే స్టే పాజిటివ్, అంటూ వీడియో షేర్ చేశాడు.ఇకపోతే  జారుడు మిఠాయా సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు తీవ్ర ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది.ఇక  ఈ క్రమంలో సొంత అన్నను మనోజ్ ట్రోల్ చేశారు అంటున్నారు.అయితే  మనోజ్ బర్త్ డే విషెస్ కి విష్ణు రిప్లై ఇవ్వకపోవడం కూడా అనుమానాలు బలపరుస్తుంది.కాగా  మనోజ్, విష్ణుల తల్లులు వేరన్న సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి: