యంగ్ హీరో నితిన్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నితిన్... 2002లో జయం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సై సినిమాలో నటించి ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయిన ఈయన.. ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి చిత్రాలతో లవర్ బాయ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొన్ని సంవత్సరాల పాటు బ్లాక్ బస్టర్ విజయాలు తన కెరీర్ లో పడలేదనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల కృత్తి శెట్టి హీరోయిన్గా నితిన్ హీరోగా తెరకెక్కిన మాచర్ల నియోజకవర్గం సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా కూడా  పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది . దీంతో డిజాస్టర్ మూట కట్టుకున్నాడు. అయితే సినిమాలు వరుసగా డిజాస్టర్ అవుతున్నప్పటికీ ఈయనకు అవకాశాలు మాత్రం భారీ స్థాయిలో వెలువడుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే తన 32వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టేశారు నితిన్. వక్కంతం వంశీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా హరీష్ జయరాజ్ వ్యవహరిస్తున్నారు.  ఇందులో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ పెళ్లి సందD సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన శ్రీ లీలా నటిస్తున్నట్లు సమాచారం.


మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో తెలియాల్సి ఉంది .ఈ సినిమా తర్వాత మరో సీనియర్ డైరెక్టర్ కు నితిన్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి .అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ తన 32వ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ను ఆదివారం 27న అధికారికంగా ప్రారంభించారు.  ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: