ఉదయ్ కిరణ్ మరణం గురించి అభిమానుల్లో ఇప్పటికీ కూడా ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి. ఉదయ్ కిరణ్ చనిపోకుండా ఉండి ఉంటే మరెన్నో సినిమాలలో నటించి విజయాలను కూడా అందుకునేవాడు.

ఉదయ్ కిరణ్ మరణం ఆయనతో పని చేసిన నటీనటులను అయితే ఎంతగానో బాధ పెట్టింది. డబ్బులు లేక ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగిందనే విషయం తెలిసిందే.

ప్రముఖ నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ నువ్వు నేను మూవీలో నా రోల్ మంచి రోల్ అని ఆయన తెలిపారు. ఉదయ్ కిరణ్ అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారని కూడా దిల్ రమేష్ పేర్కొన్నారు. నా జీవితంలోని చెడు సంఘటనలలో ఉదయ్ కిరణ్ మరణం కూడా ఒకటని ఆయన చెప్పుకొచ్చారు. శ్రీహరి గారి మరణం కూడా నన్ను చాలా బాధ పెట్టిందని దిల్ రమేష్ కామెంట్లు కూడా చేయడం విశేషం.

ప్రకాష్ రాజ్, శ్రీహరిలతో నేను ఎక్కువ సినిమాలు చేశానని కూడా ఆయన పేర్కొన్నారు.

మనం చేసిన పనికి తృప్తి చెందడం అనేది సక్సెస్ అని దిల్ రమేష్ అయితే పేర్కొన్నారు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండేవాళ్లకు స్ట్రెస్ ఎక్కువని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులో 75 లక్షల రూపాయల రేంజ్ లో ఉదయ్ కిరణ్ పారితోషికం తీసుకున్నాడని  కూడా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.సినిమాలు రాకపోతే డిప్రెషన్ వస్తుందని ఆయన వెల్లడించారు. ఉదయ్ కిరణ్ డిప్రెషన్ ఫీలయ్యాడని అందువల్లే ఆయన మృతి చెందాడని దిల్ రమేష్ పేర్కొన్నారు. దిల్ రమేష్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డబ్బులు లేక ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని జరిగిన ప్రచారంలో నిజం అయితే లేదని దిల్ రమేష్ వెల్లడించారు. ఉదయ్ కిరణ్ మరణం ఇప్పటికీ ఫ్యాన్స్ ను అయితే ఎంతగానో బాధ పెడుతోంది. స్టార్ హీరో కావాల్సిన ఉదయ్ కిరణ్ వేర్వేరు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: